Asianet News TeluguAsianet News Telugu

'సరిలేరు నీకెవ్వరు'.. ఆ సినిమాలకు కాపీనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. 

mahesh babu sarileru nekevvaru inspired from these films
Author
Hyderabad, First Published May 31, 2019, 3:10 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించారు. 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.

ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ని అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారని దర్శకుడు వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథను కొన్ని టాలీవుడ్ చిత్రాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసుకున్నట్లు సమాచారం.

ఆ చిత్రాలేంటంటే.. వెంకటేష్ నటించిన 'వారసుడొచ్చాడు', మహేష్ 'అతడు' అని సమాచారం. ఆ చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో హీరో కూడా తనతో కలిసి ఆర్మీలో పని చేసే ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లడం, అక్కడ అతడి ఫ్యామిలీకి ఊరుకి సహాయం చేయడం వంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట.

అయితే ఆ సన్నివేశాలనే దర్శకుడు అనిల్ రావిపూడి హిలారియస్ గా తెరకెక్కించనున్నాడు. తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకోబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో విజయ శాంతి, జగపతిబాబులు కీలక పాత్రలు పోషించనున్నారు. జూన్ నెలలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios