Asianet News TeluguAsianet News Telugu

మహేశ్ బాబు సినిమా పాటకు సితార డాన్స్.. స్వయంగా పోస్ట్ చేసి కూతురిని ప్రశంసించిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా పాటకు కూతురు సితారా అదిరిపోయేలా డాన్స్ చేసింది. మహేశ్ బాబు ఎంతగానో మురిసిపోతూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కూతురిపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 

Mahesh babu praise his daughter sitara to her dance
Author
First Published Jan 30, 2023, 6:10 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)కు రెండే రెండు ప్రపంచాలు అని చెప్పొచ్చు. ఒకటి సినిమా అయితే.. మరొకటి తన ఫ్యామిలీ. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి మహేశ్ బాబు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పనక్కర్లేదు. పిల్లలు సితారా, గౌతమ్ అంటే పంచప్రాణాలు. వారితో ఫన్నీగా, ఫ్రెండ్లీగా ఉంటారనే విషయం తెలిసిందే. కూతురు సితార విషయానికి కొస్తే స్టార్ కిడ్ గా ఇప్పటికే సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు ఇంట్రెస్టింగ్ రీల్స్, పోస్టులతోనూ ఆకట్టుకుంటున్నారు. 

సితారా ప్రస్తుతం స్కూలింగ్ చేస్తున్నారు. ఇటు చదువుతో పాటు సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది. ఇందుకు తల్లి నమ్రతా, మహేశ్ బాబు కూడా మురిసిపోతుంటారు. సితారా చదువు, డాన్స్, ఆటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికే చాలా సార్లు డాన్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తండ్రి మహేశ్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’లో ‘పెన్నీ’ సాంగ్ కు అదిరిపోయేలా స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. 

మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమాలోని ‘పిల్లగాలి అల్లరి’కి డాన్స్ చేసి తన తండ్రిచేతనే ప్రశంసలు పొందింది. తాజాగా మహేశ్ బాబు సితారను అభినందిస్తూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘నీ కళ్లల్లో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక మహేశ్ బాబు  అభిమానులు, నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే ఈ పోస్టుకు లక్షల్లో లైక్స్ వచ్చి చేరాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios