ప్రస్తుత రోజుల్లో దర్శకులు ఒకేసారి రెండు ప్రాజెక్టులను డిజైన్ చేసుకోవడం అనేది కుదరని పని. ఒక సినిమా పూర్తయ్యేవరకు కనీసం మరో స్క్రిప్ట్ గురించి ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే కొంతమంది ఈ రోజుల్లో అలాంటి వాతావరణానికి ఎండ్ కార్డ్ వేస్తున్నారు. హీరోల డేట్స్ దొరకడం కష్టంగా మారడంతో వీలైనంత వరకు ముందే స్క్రిప్ట్ ఒకే చేయించుకుంటున్నారు.

ప్రస్తుతం KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాంటి దారిలోనే నడుస్తున్నాడు. KGF సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ప్రశాంత్ పై అన్ని ఇండస్ట్రీల కన్నుపడింది. నేషనల్ వైడ్ గా బడా ప్రొడక్షన్ హౌజ్ దర్శకుడికి మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. దీంతో ఈ కన్నడ డైరెక్టర్ కన్ను టాలీవుడ్ హీరోలపై పడింది, ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి హీరోలతో టచ్ లో ఉంటున్నట్లు టాక్.  

ఇక ఇప్పుడు మహేష్ ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రశాంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన దగ్గర ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ గురించి మహేష్ తో డిస్కస్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడట. మహేష్ కూడా సక్సెస్ ఫుల్ దర్శకుడు కాబట్టి కథ వినేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.  ఆ తరువాత KGF2 అయిపోగానే మహేష్ తో వచ్చే ఏడాది కొత్త మూవీ స్టార్ట్ చేయాలనీ ప్రశాంత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.