మహేష్‌బాబు ఇటీవల హాలీడేస్‌కి వెళ్లారు. తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఎంజాయ్‌ చేస్తున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్‌, ముద్దుల తనయ సితారతో కలిసి మహేష్‌ వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆయన బయటకు వెళ్లారు. ఇక ఎయిర్‌పోర్ట్ లో బయలు దేరినప్పటి నుంచి.. ప్రతి రోజు తన టూర్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నారు. 

తాజాగా  మహేష్‌ మరింత కొత్తగా కనిపిస్తున్నారు. అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఫోటోని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. మార్నింగ్‌ మూడు గంటలకు విమానం కోసం వెయిట్‌ చేస్తున్నబ్రహ్మాండమైన వ్యక్తి అని తెలిపింది నమ్రత. ఈ సమయంతో ఎవరైనా ఇలా కనిపిస్తారా? అన్నట్టుగా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అయితే మరి ఏ ఎయిర్‌పోర్ట్ అనేది క్లారిటీ లేదు. మరి అప్పుడే హాలీడేస్‌ని ముగించుకుని వస్తున్నాడా? లేక మరో ప్రాంతానికి వెళ్తున్నారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. 

ఇదిలా ఉంటే మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటించనున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా ఈ నెలాఖరులోగానీ, డిసెంబర్‌ మొదటి వారంలోగానీ ప్రారంభం కానుందని తెలుస్తుంది. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు.