మహేష్‌బాబు ట్రీట్‌ కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన్నుంచి `సరిలేరి నీకెవ్వరు` సినిమా వచ్చి సందడి చేసింది. ఆ తర్వాత మరో సినిమా సెట్‌ అవ్వడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం చేస్తున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. 

`సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు మరే అప్‌డేట్‌ రాలేదు. కరోనా వల్ల సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాలేదు. దీంతో కొత్త లుక్‌లు వచ్చే అవకాశం లేదు. అయితే ఈ నెల 9న మహేష్‌బాబు పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. మరి వారిని ఎలా సాటిస్పై చేయాలనేది మహేష్‌ కి పెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఈ సినిమాలోని ట్యూన్‌ని రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. 

`సర్కారు వారి పాట` టైటిల్‌ ట్రాక్‌ని రిలీజ్‌ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సాంగ్‌కి సంబంధించిన ఫైనల్‌ ట్రీట్‌మెంట్‌ జరుగుతుందట. ఈ సినిమాకి ఎస్.ఎస్‌.థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక మహేష్‌కి జోడిగా కీర్తిసురేష్‌ని ఎంపికైంది. మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, అందుకోసం బాలీవుడ్‌ నటి అనన్య పాండే పేరుని పరిశీలిస్తున్నట్టు టాక్‌.