సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో 'వన్ నేనొక్కడినే' అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోనప్పటికీ మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో 'వన్ నేనొక్కడినే' అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోనప్పటికీ మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి.
'రంగస్థలం' తరువాత సుకుమార్ డైరెక్ట్ చేయబోయేది మహేష్ బాబునే అని సమాచారం. తాజాగా దీనికి సంబంధించి మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఈరోజు సుకుమార్ పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ ద్వారా అతడికి శుభాకాంక్షలు చెప్పాడు మహేష్.
''మోస్ట్ హంబుల్, సూపర్ టాలెంటెడ్ సుకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన సినిమా కోసం ఎదురుచూస్తున్నాను సర్'' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Wishing the most humble & super talented @aryasukku a very happy birthday... May you have a great one!!!
— Mahesh Babu (@urstrulyMahesh) January 11, 2019
Looking forward to starting our film sir 😊😊 pic.twitter.com/wgFDRq9gDQ
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 11, 2019, 2:37 PM IST