మహేష్ బాబు పుట్టిన రోజుని ఈ నెల 9 వ తేదీన జరుపుకోనున్నారు. ఈ మేరకు అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో డీపిలతో రెడీ అయ్యిపోతున్నారు. అలాగే చాలా చోట్ల సంబరాలు కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ   పుట్టిన రోజుకు మహేష్ ..తన ఫ్యాన్స్ కు ఓ గిప్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.  అందుతున్న సమాచారం మేరకు   మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా  తన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఫ‌స్ట్ లుక్ పోస్టర్  ని అఫీషియల్ గా రిలీజ్ చేయాల‌ని టీమ్ కు ఆర్డర్ వేసారట. వాళ్ళు ఆ పనిలో ఉన్నారట. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో దీనిపై యూనిట్ నుంచే అధికారిక వార్త రానుంద‌ని తెలుస్తోంది. 

సినిమా విషయాని వస్తే...  ‘మహర్షి’ తర్వాత  సూపర్ స్టార్  మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ కశ్మీర్‌లో జరిగింది. కాగా రెండో షెడ్యూల్‌  రీసెంట్ గా ప్రారంభమైందని నిర్మాతలు తెలిపారు. ఈ షెడ్యూల్‌లో  ట్రైన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నామని  , ఇది చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని పేర్కొన్నారు. మరోపక్క రైలులోనే హీరోయిన్ రష్మికతో ...మహేష్ .. ప్రేమ మొదలౌతుందని సమాచారం. 

ఆయన కశ్మీర్‌ నుంచి కర్నూలులో ఉన్న తన ఇంటికి ప్రయాణిస్తుండగా రష్మిక, ఆమె కుటుంబంతో పరిచయం ఏర్పడుతుందని చెబుతున్నారు. ‘లాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌.. రైలులో సంక్రాంతికి మిమ్మల్ని చేరుకోవడానికి వేగంగా వస్తోంది. అనిల్‌ రావిపూడితో కలిసి సూపర్‌స్టార్‌ తెరపై సందడి చేయబోతున్నారు. సిద్ధంగా ఉండండి’ అని నిర్మాత అనిల్‌ సుంకర పేర్కొన్నారు.

ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంసమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణగా కనిపించనున్నారు.