అన్నని తలచుకుని ఎమోషన్‌ పోస్ట్ పెట్టారు మహేష్‌. తన జర్నీలో అన్నయ్యది పెద్ద పాత్ర అని, తనకు ధైర్యం ఆయనే అని వెల్లడించారు. అన్న మరణం తీరని లోటని తెలిపారు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్నారు మహేష్‌. దీంతో  రమేష్‌బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహేష్‌బాబు(MaheshBabu) అన్నయ్య, సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడు రమేష్‌బాబు ఈ నెల మొదటి వారం(జనవరి 8న) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే సమయంలో మహేష్‌బాబు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయనకు కరోనా సోకడంతో ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అన్న అంత్యక్రియల్లోనూ పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. కేవలం వీడియో కాల్‌లోనే అన్నయ్యని చివరి సారి చూసుకున్నారు Mahesh. 

అనంతరం అన్నని తలచుకుని ఎమోషన్‌ పోస్ట్ పెట్టారు మహేష్‌. తన జర్నీలో అన్నయ్యది పెద్ద పాత్ర అని, తనకు ధైర్యం ఆయనే అని వెల్లడించారు. అన్న మరణం తీరని లోటని తెలిపారు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్నారు మహేష్‌. దీంతో రమేష్‌బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం(జనవరి 22)న సోదరుడు రమేష్‌బాబు పెద్దకర్మకి మహేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసినపలు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఈ కార్యక్రమంలో అన్నయ్య రమేష్‌బాబుని తలచుకుని మహేష్‌ కన్నీరు మున్నీరైనట్టు తెలుస్తుంది. మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడ్డారట. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారట. అన్నయ్య రమేశ్​ బాబు అంటే మహేశ్​ బాబుకి ఎనలేని ప్రేమ. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించిన మహేశ్​.. రమేశ్​ బాబు చనిపోయినప్పుడు భావోద్వేగంగా ట్వీట్​ చేసిన విషయం తెలిసిందే. అలాగే రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. 

మహేష్‌బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేష్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌`, `రాధేశ్యామ్‌` ల కోసం వాయిదా పడింది. అయితే ఆ చిత్రాలు కూడా తర్వాత కరోనా కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు ఏప్రిల్‌ 1న విడుదల చేయబోతున్నారు. అయితే రిలీజ్‌ డేట్‌ మళ్లీ మారే ఛాన్స్ ఉందనే టాక్‌ వినిపిస్తుంది.