Asianet News TeluguAsianet News Telugu

సితార సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేషన్.. చూస్తూ మురిసిపోతున్న మహేష్, నమ్రత.. వైరల్ వీడియో

మహేష్ సినిమాలకు, ఫ్యామిలీకి సమానంగా సమయం కేటాయిస్తారు. వీలు కుదిరితే చాలు.. భార్య పిల్లలతో మహేష్ ఫారెన్ ట్రిప్ వెళ్లడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మహేష్ పిల్లలు గౌతమ్, సితార ఎదుగుతున్నారు. చిత్ర పరిశ్రమ వైపు వాళ్ళ అడుగులు పడుతున్నట్లు అర్థం అవుతోంది.

Mahesh babu at sitara school secondary graduation
Author
First Published Mar 19, 2023, 12:58 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి సినిమా తుఫాన్ కి ముందు ప్రశాంతత లాగా మహేష్ ఈ చిత్రం చేస్తున్నారు. మహేష్ సినిమాలకు, ఫ్యామిలీకి సమానంగా సమయం కేటాయిస్తారు. వీలు కుదిరితే చాలు.. భార్య పిల్లలతో మహేష్ ఫారెన్ ట్రిప్ వెళ్లడం చూస్తూనే ఉన్నాం. 

ప్రస్తుతం మహేష్ పిల్లలు గౌతమ్, సితార ఎదుగుతున్నారు. చిత్ర పరిశ్రమ వైపు వాళ్ళ అడుగులు పడుతున్నట్లు అర్థం అవుతోంది. తన పిల్లల గురించి చిన్న విషయం అయినా నమ్రత సోషల్ మీడియా ఇట్టే పోస్ట్ చేసేస్తుంది. సితార చదువుతున్న స్కూల్ లో సెకండరీ స్కూల్ సెలెబ్రేషన్స్ జరిగాయి. సితార కూడా సెకండరీ స్కూల్ లోకి అడుగుపెట్టింది. 

ఈ కార్యక్రమానికి మహేష్, నమ్రత దంపతులు హాజరయ్యారు. తమ కుమార్తె సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటుంటే చూసి మురిసిపోయారు. ఈ విషయాన్ని నమ్రత ఫ్యాన్స్ కి తెలియజేస్తూ బ్యూటిఫుల్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. చాలా గర్వంగా ఉంది. నీవు కొత్త దశలోకి అడుగుపెట్టావు. స్కూల్ సెకండరీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా నీకు కంగ్రాట్స్ సితార. 

నాన్న, అన్నయ్య, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. సితార తమ స్కూల్ టీచర్ నుంచి సెకండరీ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న దృశ్యాలు చాలా బావున్నాయి. హుషారుగా చిరునవ్వులు చిందిస్తూ సితార తన ఫ్రెండ్స్ తో వేదికపై కనిపించింది. మహేష్ బాబు హ్యాట్ పెట్టుకుని ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios