సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఘట్టమనేని వారసత్వాన్ని మహేష్ బాబు సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు ఎప్పుడు కనిపించినా చిరునవ్వుతో దర్శనమిస్తుంటాడు. అందుకే తోటి స్టార్ హీరోలు కూడా ఆయనకు ఈజీగా ఫ్యాన్స్ అయిపోతారు. అసలు విషయంలోకి వస్తే ఈ మధ్య మహేష్ నందమూరి ఫ్యామిలీకి చాలా దగ్గరవుతున్నాడని అర్ధమవుతోంది. 

తారక్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రావడం దగ్గర నుంచి చూసుకుంటే నందమూరి వారి నుంచి ఏ సినిమా రిలీజైనా స్పందిస్తున్నాడు. కానీ ఆ సినిమాలు మాత్రం జనాలను ఎక్కువగా ఆకట్టుకోవడం లేదు. రీసెంట్ గా వచ్చిన 118 సినిమాపై కూడా మహేష్ ట్వీటేశారు. సినిమా అదిరిపోయిందని సినిమాను చూసి ఎంజాయ్ చేశానంటూ.. చిత్ర యూనిట్ కి విషెష్ ను తెలియజేశారు. 

కానీ 118సినిమాను ప్రస్తుతం ఎవరు పట్టించుకోవడం లేదు. సినిమా కలెక్షన్స్ కూడా అనుకున్నంతగా ఏమి రావడం లేదు. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ పై కూడా మహేష్ ఇదే రేంజ్ లో ట్విట్ చేశాడు. ఆ బయోపిక్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో అందరికి తెలిసిందే. ఏదేమైనా మహేష్ నందమూరిహీరోలకు బాగా దగ్గరవుతూ అందరం మంచి స్నేహితులం అని మెస్సేజ్ అయితే ఇస్తున్నాడు.