ఆర్ ఎక్స్ 100 మూవీతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు అజయ్ భూపతి. అజయ్ భూపతి మహాసముద్రం అనే మూవీ చేస్తుండగా అందులో హీరోగా శర్వానంద్ ఎంపికయ్యారు. కాగా మహాసముద్రంలో మరో హీరో సిద్దార్ధ్ నటిస్తున్నట్లు నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది.
ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మహా సముద్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన రావడం జరిగింది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మరో హీరోగా సిద్దార్ధ్ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కాగా నేడు దీనిపై అధికారిక ప్రకటన రావడం జరిగింది. మహాసముద్రం మూవీ నిర్మాతలుగా ఉన్న ఏకే ఎంటెర్టైనెర్మెంట్స్ నేడు అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.
మహాసముద్రం మూవీ ద్వారా చాలా కాలం తరువాత సిద్ధార్ధ్ తెలుగులో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. తెలుగులో కం బ్యాక్ ఇవ్వడానికి సిద్దార్ధ్ మంచి స్క్రిప్ట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉండగా, మహాసముద్రం అలాంటి స్క్రిప్ట్ గా భావించి మూవీ ఒకే చేశారు అన్నారు.టాలెంటెడ్ యాక్టర్స్ అయినా సిద్ధార్, శర్వానంద్ లను ఒకే తెరపై చూడడం ప్రేక్షకులకు కన్నుల పండుగే అని నిర్మాతలు చెప్పారు.
ఇక ఈ మూవీ నుండి త్వరలో మరిన్ని సుర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని నిర్మాతలు చెప్పడం జరిగింది. దాదాపు రెండేళ్లుగా మహాసముద్రం స్క్రిప్ట్ పై అజయ్ భూపతి పని చేస్తున్నారు. 2018 లో ఆర్ ఎక్స్ 100 విడుదల కాగా ఇంత వరకు అజయ్ భూపతి మరో మూవీ చేయలేదు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది కూడా తెలియాల్సివుంది. అప్పట్లో సమంత నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది.
