Asianet News TeluguAsianet News Telugu

మహర్షి ఇంటర్వెల్లో బ్యాంగ్.. మహేష్ చాలా బిజీ!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్  అంచనాలను చాలానే పెంచుకుంటున్నారు.

maharshi movie intarvel bang
Author
Hyderabad, First Published Nov 16, 2018, 2:15 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్  అంచనాలను చాలానే పెంచుకుంటున్నారు. అల్లరి నరేష్ ఒక స్నేహితుడి పాత్రలో కనిపిస్తుండడం - మహేష్ 25వ చిత్రం కావడం ఇలా అన్ని అంశాల్లో సినిమా అంచనాలను పెంచుతోంది. 

ఇకపోతే మొన్నటి వరకు యూఎస్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ రీసెంట్ గ్గా హైదరాబాద్ లో అడుగుపెట్టగానే మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. ముఖ్యంగా మహేష్ కు సంబందించిన సీన్స్ ఎక్కువగా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు. ఈ షెడ్యూల్ లో మహేష్ రెస్ట్ లేకుండా పాల్గొంటున్నాడు. సో సూపర్ స్టార్ చాలా బిజీ అని తెలుస్తోంది. 

ఇక ఈ షెడ్యూల్ మెయిన్ గా ఇదే ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. అమెరికన్ కంపెనీ సిఈఓ అయిన మహేష్ స్నేహితుడైన నరేష్ కోసం ఇండియాలో అడుగుపెడతాడు. అప్పుడే అసలైన కథ ఆసక్తిని రేపుతుందట. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వనున్నట్లు స్టిల్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. 

ఇప్పటికే టీజర్ ఫ్యాన్స్ ను స్పెషల్ గా ఎట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మరో షెడ్యూల్ అయిపోగానే సినిమాకు సంబందించిన ఒక సాంగ్ ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios