సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అత్యంత గ్రాస్ కలెక్షన్స్ అందించిన చిత్రంగా మహర్షి నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు - సి.అశ్విని దత్ - పివిపి సంయుక్తంగా నిర్మించారు. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేసిన మహర్షి ఇతర రాష్ట్రాల్లో సైతం మంచి వసూళ్లనే రాబట్టింది. 

మెయిన్ గా చెన్నైలో ఒక తెలుగు సినిమాకు ఎప్పుడు లేని విధంగా బారి క్రేజ్ దక్కింది. ఇది కూడా మహేష్ కెరీర్ లో మరో రికార్డ్. చెన్నైలో మహర్షి కోటికి పైగా కలెక్షన్స్ ను రాబట్టి బయ్యర్స్ కి మంచి లాభాలను అందించింది. మహేష్ బాబుకి అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 

స్పైడర్ సక్సెస్ అయ్యి ఉంటే మహేష్ కి తమిళనాడులో స్ట్రాంగ్ బిజినెస్ సెట్టయ్యేది. ఇక ఇప్పుడు మహర్షి మహేష్ మార్కెట్ ను కొంత పెంచింది. ప్రస్తుతం హాలిడేస్ లో ఉన్న మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. వచ్చే నెల ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది.