Asianet News TeluguAsianet News Telugu

‘మహానాయకుడు’: క్రిష్ ని ప్రక్కన పెట్టేసే...?

ఏ ఫీల్డ్ లో అయినా సక్సెస్ ముఖ్యం. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో సక్సెస్ లేకపోతే సీన్ సితారైపోతుంది. ఎవరినీ ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు క్రిష్ అదే పరిస్దితి ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

Mahanayakudu shooting.. Krish Sidelined?
Author
Hyderabad, First Published Feb 13, 2019, 2:00 PM IST

ఏ ఫీల్డ్ లో అయినా సక్సెస్ ముఖ్యం. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో సక్సెస్ లేకపోతే సీన్ సితారైపోతుంది. ఎవరినీ ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు క్రిష్ అదే పరిస్దితి ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అటు మణికర్ణిక రిజల్ట్ ..కంగనా ఖాతాలోకి వెళ్లింది. ఇటు ‘యన్‌.టి.ఆర్‌. కథానాయకుడు’ ఫ్లాఫ్ రిజల్ట్ తన దగ్గరకే  వచ్చి చేరింది. దాంతో సెకండ్ పార్ట్ ని అదే హీరోతో, అదే టీమ్ తో చేయటం చాలా కష్టమైందంటున్నారు. చాలా సీన్స్ రీషూట్ చేసారని టాక్. బాలయ్య కూడా తొలి భాగం రిజల్ట్ తో బాగా నిరాశపడ్డారని ఆ ప్రభావం సెట్స్ పై కనపడిందంటున్నారు.

మరో ప్రక్క డిస్ట్రిబ్యూటర్స్ ..రికవరీ సమస్యలు. అన్ని క్రిష్ ని ఇండైరక్ట్ గా ఎటాక్ చేసాయని , చాలా ఒత్తిడితో ఈ సినిమా పూర్తి చేసారని టాక్. మన పార్టీ పేరు ‘తెలుగు దేశం’... అని నందమూరి తారకరామారావు ప్రకటించడంతో ‘యన్‌.టి.ఆర్‌. కథానాయకుడు’ చిత్రం  పూర్తయింది. ఎన్టీఆర్ బయోపిక్ లో ఇది మొదటి భాగమే. అయితే సినిమా వర్కవుట్ కాలేదు. డబ్బులు రాలేదు. అనేకానేక విమర్శలూ వచ్చాయి. ఈ నేపధ్యంలో  రెండో భాగం రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ విషయమై మీడియాలో అనేక వార్తలు వచ్చాయి.

వాటికి  తెరదించుతూ ‘యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు’ను ఫిబ్రవరి 22 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. అంతవరకూ బాగానే ఉంది.. అయితే రెండో భాగం అయినా బాగా వచ్చిందా ..లేక మొదట భాగంలాగే బోర్ గా ఉంటుందా అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం మేరకు తొలి భాగం అంటే ‘యన్‌.టి.ఆర్‌. కథానాయకుడు’ చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు క్రిష్ కు పూర్తి స్వేచ్చ ఉండేది.

ఆయన తన నిర్ణయాలను అన్నిటిని దాదాపు అమలు జరిపేవారు. అయితే రెండో పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ సినిమా డిజాస్టర్ ఎదురుగా ఉండటంతో సమస్యలు ఎదురయ్యాయంటున్నారు. ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత, బాలయ్య బంధువు అయిన ఎమ్ ఆర్వీ ప్రసాద్ సీన్ లోకి రావటం క్రిష్ కు చెక్ పెట్టినట్లు అయ్యిందిట. దాదాపు అన్ని డెసిషన్స్ ఆయనే తీసుకుంటున్నారట.

క్రిష్ కేవలం వచ్చి డైరక్షన్ చేసి వెళ్లటమే అంటున్నారు. చివరకు రిలీజ్ డేట్, ట్రైలర్ వంటి విషయాల్లో కూడా నామ మాత్రంగానే ఆయన ప్రెజన్స్ ఉంటుందంటున్నారు. రెండో భాగంలో ఎక్కువగా ‘తెలుగు దేశం’ పార్టీ ప్రస్థానంపై దృష్టి పెడతారని సమాచారం. యన్‌.బి.కె. ఫిల్మ్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నందమూరి బాలకృష్ణ, నందమూరి వసుంధరాదేవి నిర్మించారు. వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలు. ఎం.ఆర్‌.వి.ప్రసాద్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

  

Follow Us:
Download App:
  • android
  • ios