బిగ్ బాస్ సీజన్ 2 వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ షోపై నటి మాధవీలత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో నిన్నటివరకు జరిగిన ఫ్యామిలీ ఎమోషనల్ టాస్క్ కి ఆమె రివ్యూ ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి ఆ టాస్క్ లో రేటింగులు కూడా ఇచ్చింది.

అందరికంటే కౌశల్ తన పిల్లలను హత్తుకునే దృశ్యాలు తన మనసుని కదిలించాయని, సినిమా స్టైల్ లో ఎడిట్ చేసి చూపించారని ఆమె తెలిపింది. ఇతర సభ్యుల గురించి మాట్లాడుతూ.. సామ్రాట్ పై కామెంట్స్ చేసింది.

''కోర్టు పని మీద సామ్రాట్ రెండు సార్లు బయటకి వెళ్లాడు. అప్పుడు తన అమ్మని కలవలేదా..? ఒకే నెలలో రెండు సార్లు ఫ్యామిలీ కేసు మీద వెళ్తే కుటుంబ సబగులను కలవడా..?. ఇంట్లోకి వచ్చిన సామ్రాట్ తల్లి 'ఎంతకాలం అయింది నిన్ను చూసి, నువ్వు స్ట్రాంగ్ అనుకోలేదు అనడం ఏంటి..? ఏమో నాకు డౌటే'' అంటూ కామెంట్స్ చేసింది.

ఇక తనీష్ ని టార్గెట్ చేస్తూ.. తనీష్ నాకు నచ్చడు. తన ఆలోచన విధానం తప్పు. కౌశల్ పాపని చూసినప్పుడు మాత్రం మీ పాప చాలా క్యూట్ గా ఉంది.. మీకు నాకు ఎన్ని ఉన్నా మీ పాప కోసం మాత్రం మీ ఇంటికి వస్తాను అన్నాడు. అది హార్ట్ ఫుల్ గా అన్నాడు. ఇక తనీష్ తమ్ముడు మాత్రం తన అన్నకి శత్రువైన కౌశల్ తనకు కూడా శత్రువు అన్నట్లుగా ప్రవర్తించాడు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.