Asianet News TeluguAsianet News Telugu

మా ఎలక్షన్స్... మంచు విష్ణు మాటలు బాధపెట్టాయి, అందుకే ఆ కామెంట్ చేశాను

ఇటీవల రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలకు విష్ణు స్పందించి.. ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పక్కనున్నాడా..లేక పవన్ కళ్యాణ్ పక్కనున్నాడా అని అన్నారు. దానికి ప్రకాష్ రాజ్ తిరిగి పవన్ కళ్యాణ్ మార్నిగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు మీ సినిమా బడ్జెట్ అని సమాధానం ఇచ్చారు.

maa elections heat prakash raj clarifies why he commented on manchu vishnu
Author
Hyderabad, First Published Oct 4, 2021, 8:11 AM IST


టాలీవుడ్ లో మా ఎన్నికల వేడి కొనసాగుతుంది. మరో వారం రోజులలో ఎన్నికలు నేపథ్యంలో ప్రధానంగా పోటీ పడుతున్న ప్యానెల్స్ ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మోహన్ బాబు, విష్ణులతో వచ్చిన క్లాష్‌పై నటుడు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 
 

అయితే ఇటీవల రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలకు విష్ణు స్పందించి.. ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పక్కనున్నాడా..లేక పవన్ కళ్యాణ్ పక్కనున్నాడా అని అన్నారు. దానికి ప్రకాష్ రాజ్ తిరిగి పవన్ కళ్యాణ్ మార్నిగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు మీ సినిమా బడ్జెట్ అని సమాధానం ఇచ్చారు.అయితే ప్రకాష్ రాజ్ ఇలా ఎందుకన్నారో తాజాగా క్లారిటీ ఇచ్చారు. 


మోహన్ బాబు బంగారం. ఆయన కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. గతంలో లక్ష్మీ చేసిన రెండు ప్రోగ్రాంస్‌కి కూడా నేను వెళ్ళడం జరిగింది. పర్సనల్‌గా నాకు వారంటే చాలా గౌరవం, అభిమానం అని అన్నారు. ఇదే సందర్భంలో మంచు ఓ విలేఖరి అడిగిన ప్రశ్న వేరైనా తను ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పక్కనున్నాడా..లేక పవన్ కళ్యాణ్ పక్కనున్నాడా అనడం కొద్దిగా బాధ కలిగించింది. అందుకే అలా మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా వేరే కారణాలు ఏవీ లేవు. అని ప్రకాష్ రాజ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios