Asianet News TeluguAsianet News Telugu

'మా' లో ఉంది గొడవలే, బాహుబలిలా రావద్దు మదర్ థెరిస్సాలా రండి- నటుడు శివబాలాజీ

ప్రస్తుత కమిటీ సభ్యులలో ఒకరిగా ఉన్న శివ బాలాజీ సైతం మాట్లాడారు. గత రెండేళ్లు 'మా' అభివృద్ధి కోసం, సభ్యులుగా ఉన్న ఆర్టిస్ట్స్ ప్రయోజనాల కోసం ఎంతో కష్టపడినట్లు తెలియజేశారు. రెండు నెలలు దీనికి సంబంధించిన వర్క్ నేర్చుకొని నరేష్ గారితో పాటు కష్టపడినట్లు తెలియజేశారు.

maa elections actor siva balaji reacts nagababu and prakash raj comments ksr
Author
Hyderabad, First Published Jun 26, 2021, 1:31 PM IST

నిన్న ప్రెస్ మీట్ లో ప్రస్తుత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులపై ప్రకాష్ రాజ్, నాగబాబు వంటి నటుల ఆరోపణల నేపథ్యంలో, వివరణ ఇచ్చేందుకు నేడు ప్రెస్ ముందుకు వచ్చారు నటులు నరేష్, కరాటే కళ్యాణి, శివ బాలాజీ, గౌతమ్ రాజు. 'మా' కమిటీపై వారు చేసిన ఆరోపణలను ఖండించిన నటుడు నరేష్ ఆధారాలతో సహా వారు నెరవేర్చిన మంచి కార్యక్రమాలు తెలియజేశారు. 


ప్రస్తుత కమిటీ సభ్యులలో ఒకరిగా ఉన్న శివ బాలాజీ సైతం మాట్లాడారు. గత రెండేళ్లు 'మా' అభివృద్ధి కోసం, సభ్యులుగా ఉన్న ఆర్టిస్ట్స్ ప్రయోజనాల కోసం ఎంతో కష్టపడినట్లు తెలియజేశారు. రెండు నెలలు దీనికి సంబంధించిన వర్క్ నేర్చుకొని నరేష్ గారితో పాటు కష్టపడినట్లు తెలియజేశారు. మొదట్లో కమిటీ మీటింగ్స్ లో సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని ఆయన ఒప్పుకున్నారు. భిన్న ప్యానెల్స్ కి సంబంధించిన సభ్యులు గెలవడం వలన అభిప్రాయ బేధాలు ఉండేవని తెలియజేశారు. 


ఒకే ప్యానెల్ లోని అందరు సభ్యులను గెలిపిస్తే ఈ సమస్య రాదని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు. ఇక కరోనా సమయంలో పేద కళాకారుల కోసం అనేక కార్యక్రమాలు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఫేమ్ లేని నటులకు కరోనా సమయంలో ఆసుపత్రి బెడ్ కూడా లభించేది కాదని, దాని కోసం అర్థ రాత్రులు కూడా కృషి చేశాం అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోలేని పేద కళాకారులు కోసం మిత్రులు, తెలిసినవారి నుండి నిధులు సేకరించామని తెలియజేశారు. 


చివరిగా బాలాజీ మాట్లాడుతూ.. ఎవరైనా పోటీ చేయవచ్చని, కాకపోతే ఇక్కడికి ఒక బాహుబలిలా రావద్దు, మథర్ థెరిస్సాలా సేవా భావంతో రండి అంటూ కోరుకున్నారు. ఇకపై నేను ఈ విషయంపై మాట్లాడాలని అనుకోవడం లేదని, ఎలక్షన్స్ కి ఇంకా రెండు నెలల సమయం ఉంది, ఈ రెండు నెలల్లో మేము చేయాల్సినది ఇంకా చాలా ఉందని శివ బాలాజీ ముగించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios