Asianet News TeluguAsianet News Telugu

చిరుకి అంత సీన్ ఉందా..?

'బాహుబలి' సినిమా స్ఫూర్తితో తెలుగులో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

low buzz on uyyalavada narasimhareddy
Author
Hyderabad, First Published Jul 6, 2019, 9:03 AM IST

'బాహుబలి' సినిమా స్ఫూర్తితో తెలుగులో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ లెవల్లో సినిమాను మొదలుపెట్టారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సినిమాకు వంద కోట్ల వరకు మార్కెట్ ఉంటుంది కానీ రెండు వందల కోట్లకి పైగా పెట్టుబడి రాబట్టాలంటే తెలుగుతో పాటు ఇతర మార్కెట్లలోనూ రాణించక తప్పదు.

'బాహుబలి' సినిమా తరువాత తెలుగు చిత్రాలకి ఇతర భాషల్లో పెరిగిన ఆదరణతో 'ఉయ్యాలవాడ' విషయంలో రిస్క్ చేశారు. అయితే బాహుబలి రేంజ్ లో ఇతర భాషల వారి దృష్టిని ఆకర్షించడంలో 'సై రా' ఇంతవరకు సక్సెస్ కాలేదనే చెప్పాలి.

ఈ సినిమా టీజర్ లో ఎలాంటి ప్రత్యేకతలు లేకపోవడంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేదు. టాలీవుడ్ లోనే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు ఇక ఇతర భాషల్లో బజ్ ఎలా క్రియేట్ చేస్తారు. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించిన క్రమంలో ఈ సినిమాపై బజ్ పెంచడం ఎలా అనేదానిపై నిర్మాత చరణ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ సినిమాలకు ప్రీరిలీజ్ బజ్ ఓ రేంజ్ లో ఉంటేనే ఓపెనింగ్స్ బాగా వస్తాయి. ఇక హిట్ టాక్ వస్తే.. భారీ వసూళ్లు సాధించడానికి తోడ్పడుతుంది. ఇప్పటినుండి ప్రమోషన్స్ పై దృష్టి పెట్టకపోతే గనుక ఇతర భాషల సంగతి తరువాత ముందు టాలీవుడ్ లో కూడా జనాలకు ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లడం ఖాయం! 

Follow Us:
Download App:
  • android
  • ios