Asianet News TeluguAsianet News Telugu

‘లవ్ స్టోరీ’ మూవీ ఇంట్రస్టింగ్ అప్‏డేట్

ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.‘‘ఫిదా’’ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమాకావడం.నాగ చైతన్య,సాయి పల్లవి లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటం ఈ ఎక్స్ పెక్టేషన్స్ కు కారణం.ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. షూటింగ్ అంతా కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు
చకచకా జరుపుకుంటుంది.

Love Story teaser to be unveiled on Jan 10 jsp
Author
Hyderabad, First Published Jan 8, 2021, 8:00 AM IST

 సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ప్రేమకథలను సహజంగా తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్,శేఖర్ కమ్ముల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘లవ్ స్టోరీ’ టీజర్ అప్‏డేట్ వచ్చేసింది. లవ్ స్టోరీ సినిమా టీజర్ జనవరి 10న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను కూడా షేర్ చేశారు మేకర్స్.  

ఇక ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ ఆ తర్వాత ఎలాంటి  కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా  సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా చేయడం తో ఈ  ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగింది.

 డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈసినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు శేఖర్ ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ గా అయింది.  

థియేటర్లు తెరుచుకుని, హాల్స్ దగ్గర ఆడియెన్స్ సందడి మొదలు కాగానే ”లవ్ స్టోరి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
 

Follow Us:
Download App:
  • android
  • ios