Asianet News TeluguAsianet News Telugu

‘లవ్ స్టోరీ’ ఓటీటి రిలీజ్ డేట్


ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజైన నాలుగు వారాలకు ఈ సినిమాని ఓటీటిలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే ఫిదా కు వచ్చినంత క్రేజ్ ఈ ప్రాజెక్టు కు రాలేదు. సక్సెస్ కూడా ఆ స్దాయిలో లేదు. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ కూడా ఈ సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు. మరి ఓటీటిలో ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటున్నారు.
 

Love Story OTT Release Date Finalized
Author
Hyderabad, First Published Oct 11, 2021, 11:29 AM IST

ఫిదా మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన  డైరెక్టర్ శేఖర్ కమ్ముల గ్యాప్ తీసుకుని లవ్ స్టోరీ చిత్రం చేసారు.  క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య , బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రం భాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే వర్కవుట్ అయ్యింది.  దాంతో ఈ సినిమా కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ భారీగా పోటీపడ్డాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికాయి. మొదట జీ5,ఆ తర్వాత అమెజాన్ రేసులోకి వచ్చింది. చివరకు ఆహా వారు ఈ సినిమాని సొంతం చేసుకున్నారు.  

ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజైన నాలుగు వారాలకు ఈ సినిమాని ఓటీటిలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే అక్టోబర్ 22 నుంచి ఈ సినిమా ఓటీటిలో రాబోతోందని సమాచారం. అయితే ఫిదా కు వచ్చినంత క్రేజ్ ఈ ప్రాజెక్టు కు రాలేదు. సక్సెస్ కూడా ఆ స్దాయిలో లేదు. రిలీజ్ కు ముందు ఉన్న హైప్ కూడా ఈ సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు. మరి ఓటీటిలో ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలంటున్నారు.

ఇక ఈ సినిమాలో సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలను ఈ మూవీలో బాగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచి, సెకండాఫ్‌ వచ్చేసరికి సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారు. నాగచైతన్య, సాయి పల్లవిల నటన అయితే అదిరిపోయింది.  సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్.  రొటీన్ ఫ్యామిలీ డ్రామా కాకపోవటం, సినిమాలో  కొత్త సన్నివేశాలు ప్లస్ అయ్యాయి. తొలిరోజు లవ్‌స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ఒక యూఎస్‌లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్‌ వేవ్‌ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్‌ కలెక్షన‍్లను రాబట్టిన చిత్రంగా లవ్‌స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల మాట. 

 కరోనా సెంకడ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి అద్బుతం అనిపించింది. తాజాగా ఈ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.  అమెరికాలో ల‌వ్‌స్టోరీ విడుద‌లైన 3 రోజుల్లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.7 కోట్ల 37 ల‌క్ష‌లు) వసూళ్లు రాబట్టింది. లవ్‌స్టోరి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 32.8 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని టాక్‌. నైజాం ఏరియాలో 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.36 కోట్ల దాకా లాభాలను రాబట్టాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios