Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్ టాక్ : 'ల‌వ్ స్టోరీ' లాభ‌మెంత‌? ఎంత పెట్టారు

లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని విధంగా అదరకొట్టింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో  సెకండ్ వేవ్ త‌ర‌వాత తెలుగు చిత్ర సీమ చూసిన అతి పెద్ద హిట్ గా ఈ సినిమా గా అవతరించింది. 

Love Story Movie Latest Box Office Collections
Author
Hyderabad, First Published Oct 2, 2021, 12:23 PM IST


అక్కినేని హీరో నాగ చైతన్య,   సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  రూపొందిన చిత్తరం ‘లవ్ స్టోరీ’ . ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని విధంగా అదరకొట్టింది. ఈ సినిమా మొదటి రోజున 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో  సెకండ్ వేవ్ త‌ర‌వాత తెలుగు చిత్ర సీమ చూసిన అతి పెద్ద హిట్ గా ఈ సినిమా గా అవతరించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఎంత పెట్టారు..ఎంత లాభం వచ్చింది వంటి విషయాలు చూద్దాం.

ఫస్ట్ వీకెండ్ లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో న‌డిచిన ల‌వ్ స్టోరి వ‌ర‌ల్డ్ వైడ్ రూ.22 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టింది. అయితే వీకెండ్ త‌ర్వాత ఈ సినిమాకు దెబ్బ ప‌డింది. ఓ ప్రక్కన సినిమా క్లైమాక్స్ సరిగ్గా లేదంటూ డివైడ్ టాక్‌. అలాగే  ఒక రోజు బంద్‌, మూడు రోజులు వ‌ర్షాలు వ‌సూళ్లపై ప్ర‌భావం చూపాయి. దీని వ‌ల్ల ఫస్ట్ వీకెండ్ తో పోలిస్తే తొలి వీక్ క‌లెక్ష‌న్లు అనుకున్న స్దాయిలో లేవు. వీకెండ్ త‌ర్వాత ఐదు రోజుల్లో ఐదు కోట్ల షేర్ రాబ‌ట్టి వారం మొత్తంలో రూ.27 కోట్ల షేర్‌తో నిలిచింది ల‌వ్ స్టోరి.

అందుతున్న సమాచారం మేరకు ల‌వ్ స్టోరీ బ‌డ్జెట్ దాదాపుగా 35 కోట్ల‌ు. మ‌రో 8 కోట్లు దాటితే టార్గెట్ రీచ్ అవుతుంది. అయితే నాన్ థియేట‌రిల్ రైట్స్ రూపంలో దాదాపుగా 22 కోట్లు రావటం కలిసొచ్చే అంశం. అంటే అన్ని కలిసొస్తే.. దాదాపు 12 కోట్ల లాభాలు వచ్చినట్లే. సెకండ్ వీక్ లోనూ ల‌వ్ స్టోరీ నిల‌క‌డైన వ‌సూళ్లు రాబ‌డితే.... క‌నీసం 20 కోట్ల లాభం క‌ళ్ల చూసిన‌ట్టు అవుతుంది.  ఈ శుక్రవారం రిలీజైన రిప‌బ్లిక్ సీరియ‌స్ సినిమా కావ‌డం, దానికి టాక్ సరిగ్గా రాక‌పోవ‌డం ల‌వ్ స్టోరికి క‌చ్చితంగా క‌లిసొచ్చే అంశం. శ‌నివారం విడుద‌ల కానున్న ఇదీ మా క‌థ మీద కూడా ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి  లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios