Asianet News TeluguAsianet News Telugu

మహా శివుడిపై భారీ ఖర్చుతో పాట.. వాళ్లిద్దరూ డాన్స్ ఎలా చేస్తారో తెలుసుగా!

ప్రస్తుతం త్వరలో విడుదల కాబోతున్న రెండు పాన్ ఇండియన్ మూవీస్ పైనే సినిమా అభిమానులు దృష్టి నెలకొంది ఉంది. అందులో ఒకటి సైరా నరసింహారెడ్డి, రెండవది వార్. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్. సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. 

lord siva song in Hrithik, Tiger shroff's War movie
Author
Hyderabad, First Published Sep 20, 2019, 3:56 PM IST

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న వార్ చిత్రాన్ని ప్రముఖ యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ దాదాపు 200 కోట్ల భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇద్దరు యాక్షన్ హీరోలు నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. 

ఈ చిత్రం గురించి బయటకు వస్తున్న ఒక్కో విశేషం ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే హృతిక్ రోషన్, అందాల తార వాణి కపూర్ మధ్య తెరకెక్కించిన పార్టీ సాంగ్ ని ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలోని మరో పాటని రిలీజ్ చేయబోతున్నారు. 

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మధ్య తెరకెక్కించిన జై జై శివ శంకర్ అనే పాటని తెరకెక్కించారు. మహా శివుడిపై తెరక్కించిన ఈ సాంగ్ ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉండబోతోంది అని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తేలితెలిపారు.ఈ సాంగ్ కోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ బొకోసో మార్టిస్ దాదాపు మూడు నెలలు వర్కౌట్ చేసినట్లు దర్శకుడు వివరించాడు. 

ఇక సంగీత దర్శకులు విశాల్ శేఖర్ ద్వయానికి కూడా చాలా క్లియర్ గా సూచనలు ఇచ్చా. ఇది కేవలం సాంగ్ మాత్రమే కాదు. అంతకు మించేలా ఉండాలి. దైవ భక్తిని పెంపొందించేలా, అదే సమయంలో ఆడియన్స్ చిందులు వేసేలా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్ కు సూచించా. 

వాళ్ళు కూడా చాలా భాద్యతగా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఇండియాలో ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ శివుడి పాటకు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. దాదాపు 500 మంది డాన్సర్లు ఈ సాంగ్ లో పాల్గొన్నారు. ఇండియన్ స్క్రీన్ పై గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పాట ఉండబోతోంది. 

వాణి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. వాణి మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో అందాలు ఆరబోసింది. బికినిలో సైతం కనిపించింది. ఇటీవల విడుదలైన వార్ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అక్టోబర్ 2న వార్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios