Asianet News TeluguAsianet News Telugu

#LEO ఓటిటి రిలీజ్ ట్విస్ట్.. రెండు చోట్లా రెండు వెర్షన్స్!

 లియో ఓటిటి రాక కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.   ఓటిటిలో లియో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leo is coming to Netflix on 24th Nov in India and 28th Nov Globally jsp
Author
First Published Nov 22, 2023, 9:33 AM IST


ఫైనల్‌గా  'లియో' సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిలీజ్ డేట్ విషయంలోమాత్రం  ట్విస్ట్ ఇచ్చారు.  ఈ సినిమాకు రెండు డేట్స్ లాక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.  మొదటగా 24 నవంబర్ ఇండియా లో తర్వాత 28 నవంబర్ గ్లోబల్ గా వస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చారు. అయితే  రిలీజ్ చేసిన పోస్టర్ లు గమనిస్తే ఇండియా వెర్షన్ పోస్టర్ ప్లైన్ గా ఉండగా గ్లోబల్ పోస్టర్ మాత్రం యాక్షన్ అంశాలతో కనిపిస్తుంది. అంటే గ్లోబల్ వెర్షన్ లో “లియో” సెన్సార్ లేని కట్ తో వస్తే ఇండియా లో మాత్రం కట్ చేసిన వెర్షన్ రాబోతున్నట్టుగా అర్ధం చేసుకోవాలి. దీనితో ఈ చిత్రం సెన్సార్ లేని వెర్షన్ కోసం ఎదురు చూస్తున్న ఇండియా ఫ్యాన్స్ కి మాత్రం బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు.  

ఇక లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా.. దసరా కానుకగా అక్టోబర్‌ 19న రిలీజ్ అయిన లియో సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా తమిళ్‌తో పాటు తెలుగులో భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది లియో. కానీ అనుకున్న రేంజ్ అంచనాలను అందుకోలేకపోయింది. అయితేనేం ఈ సినిమా   ఓటిటిలోకి వస్తున్న నేపథ్యంలోనూ ఫ్యాన్స్  రచ్చ మామూలుగా లేదు. నవంబర్‌ 24న తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో లియో స్ట్రీమింగ్‌ కానుండగా.. 28న వరల్డ్ వైడ్‌గా ఓటిటిలో అందుబాటులోకి రానుంది.  

 ఈ క్రమంలో త్వరలో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతున్న నేపధ్యంలో కొత్త విషయం రివీల్ చేసారు డైరక్టర్ లోకేష్ కనకరాజ్. లియో థియేటర్ వెర్షన్ కు ,ఓటిటి వెర్షన్ కు చాలా తేడా ఉంటుందని చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఈ విషయం ప్రస్తావించాడు. అతను చెప్పిన దాని ప్రకారం   లియో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వటానికి , ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవటానికి ఉద్దేశించింది. అయితే ఓటిటి వెర్షన్ లో వేరుగా ఉంటుందని అన్నారు. లియో కథ ప్రకారం...సినిమాలో హీరో పాత్ర లక్ష్యం లియో చచ్చిపోయాడని, తాను పార్ధీపన్ అని ప్రపంచం నమ్మించాలని నిరంతరం ప్రయత్నించటమే. ఓటిటి వెర్షన్ లో లియో కేవలం క్లైమాక్స్ లో మాత్రమే అంటోని దాస్ కు తాను లియోని అని రివీల్ చేస్తాడని అన్నారు. అప్పటిదాకా ఆ సస్పెన్స్ అలాగే కొనగాగుతుందని అన్నారు. ఇక  కొన్ని థియేటర్ వెర్షన్ లో లేని సీన్స్ ఓటిటిలో కనపడబోతున్నాయట. 
  
  ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంది లియో.

Follow Us:
Download App:
  • android
  • ios