Varun Tej -Lavanya: వరుణ్ తేజ్ ను విష్ చేసిన లావణ్య, మరోసారి తెరపైకి లవ్ రూమర్స్

మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి లవ్ ట్రాక్ రూమర్స్ గురించి అందరికి తెలిసిందే.ఆ మధ్య హీరోయిన్ క్లారిటీతో ఈ పేజ్ ముగిసిపోయింది అనుకున్నారంతా. కాని ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ లావణ్య లవ్ ట్రాక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది. 

Lavanya Tripathi wishing Varun Tej

మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి లవ్ ట్రాక్ రూమర్స్ గురించి అందరికి తెలిసిందే.ఆ మధ్య హీరోయిన్ క్లారిటీతో ఈ పేజ్ ముగిసిపోయింది అనుకున్నారంతా. కాని ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ లావణ్య లవ్ ట్రాక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది. 

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి  ల మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కొంతకాలంగా వీరి రిలేషన్ షిప్ పై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ మధ్య జరిగిన జోరు ప్రచారం చిన్నగా కామ్ అయ్యింది. అయితే మరోసారి వీరిద్దరి లవ్ ట్రాక్ గురించి సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయ్యింది. 

 వీరిద్దరి లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో రకరకాలు పుకార్లు పుడుతున్నా.. ఇంత వరకూ ఈ వార్తలపై అటు వరుణ్‌ తేజ్ కాని , లావణ్య త్రిపాఠి  కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ వార్తలకు బంలం చేకూర్చుతూ మరోసారి వీరి లవ్ ట్రాక్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. తాజాగా వరుణ్‌ తేజ్‌కి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో స్పెషల్‌ విషెస్‌ తెలియజేసిందీ.
ఈ విషెస్ తో వీరిద్దర మధ్య ఏదో ఉంది అంటూ మరోసారి నిప్పు రాజుకుంది నెట్టింట్లో. దీంతో ఈ రూమర్స్‌ మరోసారి తెరపైకి వచ్చాయి. వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీ గని. వరుణ్‌ తేజ్‌, సయీ మంజ్రేకర్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రేపు (08 ఏప్రిల్) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు.

 

సినిమా రిలీజ్‌  సందర్భంగా గని టీంకు లావణ్య స్పెషల్‌ విషెస్‌ చెప్పింది. అంతే కాదు వరుణ్ ను పొగడ్తలతో ముంచెత్తింది. ఇంతకీ లావణ్య ఏమన్నదంటే.. వరుణ్‌.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్‌ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతుంది. 

వరుణ్ గురించి లావణ్య ట్వీట్ చేయడంతో వీరిద్దరి మధ్య పక్కాగా ఏదో ఉంది అంటూ నెటిజన్లు చాల మంది అభిప్రాయ పడుతున్నారు. కొంత మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారి అయినా... ఈ రూమర్స్ కు ఇద్దరిలో ఎవరో ఒకరు చెక్ పెడతారేమో చూడాలి మరి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios