Asianet News TeluguAsianet News Telugu

మెగా న్యూస్: చెర్రీ సినిమాకు చిరు టైటిల్?

మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ గా రానున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం టైటిల్ కోసం తెగ చర్చలు జరుపుతోంది. దసరాకి ఎలాగైనా అభిమానుల ముందు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఉంచాలని ఫిక్స్ అయ్యారు. 

latest update on charan boyapati movie
Author
Hyderabad, First Published Sep 25, 2018, 5:44 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ గా రానున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం టైటిల్ కోసం తెగ చర్చలు జరుపుతోంది. 

దసరాకి ఎలాగైనా అభిమానుల ముందు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఉంచాలని ఫిక్స్ అయ్యారు. అసలు విషయంలోకి వస్తే ఈ చిత్రానికి మెగాస్టార్ పాత సినిమా టైటిల్ ను సెట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. బి.గోపాల్ దర్శకత్వంలో 1989లో వచ్చిన స్టేట్ రౌడీ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అదే సినిమా టైటిల్ ను రామ్ చరణ్ 12వ సినిమాకు ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్ తో కూడా చర్చలు జరిపిన తరువాత ఈ విషయంపై చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కైరా అధ్వాని నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios