నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’షోకు తోలిసారిగా బ్యూటీఫుల్ సీనియర్ యాక్ట్రెస్ రాబోతున్నారు. నెక్ట్స్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ వస్తాడని అంతా భావిస్తుండటంతో.. తాజా అప్డేట్ తో ‘ఆహా’ క్లారిటీ ఇచ్చింది.
‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది మొదటి సీజన్ తో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ ను దక్కించుకుని.. బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా వ్యవహరించడం షోకు బాగా కలిసివచ్చింది. బాలయ్యలోని ఫన్ యాంగిల్ తో స్టార్ తో బుల్లితెరపై సందడి చేయడం ఆడియెన్స్ ను, అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రెండో సీజన్ ప్రారంభమై.. ఐదు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.
ఆరో ఎపిసోడ్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరియు యాక్షన్ స్టార్ గోపీచంద్ (Gopichand) సందడి చేయబోతున్నారు. ఇక ఏడో ఎపిసోడ్ పై ఓ హింట్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడంటూ.. వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నెక్ట్స్ ఎపిసోడ్ లో పవర్ స్టార్, త్రివిక్రమ్ ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో తాజా అప్డేట్ తో షో నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు.
Unstoppable with NBK Season 2 నెక్ట్స్ ఎపిసోడ్ లో టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ మేరకు షోలో వారు సందడి చేసిన ఫొటోలను కూడా పంచుకున్నారు. ఏడో ఎపిసోడ్ లో అందం అభినయం కలగలిసిన సహజ నటి జయసుధ (Jayasudha), మల్టీ టాలెంటెడ్ జయప్రద (Jayapradha) మరియు యంగ్ బ్యూటీ రాశీ ఖన్నాను ఆహ్వానించినట్టు తెలిపారు. తొలిసారిగా షో మొత్తంగా లేడీ గెస్ట్స్ రాబోతుండటంతో ‘అన్ స్టాపబుల్ 2’మరింత బ్యూటీఫుల్ గా మారనుంది.
మరోవైపు బుల్లితెరపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫస్ట్ టైమ్ అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ - గోపీచంద్ కు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. రీసెంట్ గా విడుదలైన ప్రోమోకే ఒక్కరోజులోనే 10 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కడం విశేషం. డిసెంబర్ 30న ‘ఆహా’లో ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ఎపిసోడ్ పై మున్ముందుకు అప్డేట్ అందించనున్నట్టు తెలుస్తోంది.
