అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుండి లాస్య ఎలిమినేటై బయటికి వచ్చేశారు.  ఈ వారానికి గానూ అతి తక్కువ ఓట్లు పొందిన లాస్య ఎలిమినేట్ కావడం జరిగింది. ఇంటి నుండి బయటికి వచ్చిన లాస్య బిగ్ బాస్ బజ్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. హోస్ట్ రాహుల్ సిప్లిగంజ్ లాస్యను ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రోగ్రాంలో లాస్య ఇంటి సభ్యులు అందరిపై తన అభిప్రాయం తెలిపారు. 

హారిక చిన్న టపాసు అని, అయినా బాగా పేలుతుందని చెప్పింది. ఆరియానా సన్నగా కనిపించినా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పింది. ఇక అభిజిత్ కి ఓవర్ థింకింగ్ ఎక్కువని, సోహైల్ గొడవ ఏదైనా క్లియర్ చేసుకొనే వరకూ ప్రశాంతం ఉండదు అని చెప్పింది. 

ఐతే ఇంటిలోని లవ్ బర్డ్స్ మోనాల్-అఖిల్ లవ్ స్టోరీ పై లాస్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటిలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్లే కలిసిపోతారు. ఇవన్నీ చూసే మనం అని లాస్య ఎదో చెప్పబోతుండగా...రాహుల్ హౌలా గాళ్ళం అని నవ్వేశాడు. ఇంటర్వ్యూలో కూడా సేఫ్ సమాధానాలు రాహుల్ ని ఇబ్బంది పెట్టాయి. 

ఇక లాస్య నిష్క్రమణతో ఇంటిలో కేవలం ఏడుగురు సభ్యులు మిగిలారు. ఈ ఏడుగురు సభ్యుల నుండి వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ ఆసక్తికరంగా మారుతుంది.