Asianet News TeluguAsianet News Telugu

పరిశ్రమలో విషాదం... లాల్ సింగ్ చద్దా నటుడు మృతి!


బాలీవుడ్ సీనియర్ నటుడు అరుణ్ బాలి కన్నుమూశారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అరుణ్ బాలి అనారోగ్య కారణాలతో మరణించినట్లు సమాచారం అందుతుంది. 
 

lal singh chadda fame arun bali dies at 79
Author
First Published Oct 7, 2022, 1:01 PM IST


బాలీవుడ్ సీనియర్ నటుడు అరుణ్ బాలి నేటి ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో అరుణ్ బాలి బాధపడుతున్న సమాచారం. అరుణ్ బాలి మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అరుణ్ బాలి చివరి చిత్రం అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా. 

పంజాబ్ కి చెందిన అరుణ్ బాలి 1989 లో బుల్లితెర నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్లో ఎదుగుతూ బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. కేదార్ నాథ్, పీకే, పానిపట్, 3 ఇడియట్స్ వంటి హిట్ చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ రోల్స్ చేశారు. తన మార్కు నటనతో అరుణ్ బాలి అభిమానులను సొంతం చేసుకున్నారు. 

1942 లో అరుణ్ బాలి పంజాబ్ లోని జలంధర్ లో జన్మించారు. పలు హిట్ టీవీ సీరియల్స్ లో అరుణ్ బాలి నటించారు. కుంకుమ్ ఏక్ ప్యారసా బంధన్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అరుణ్ బాలి మృతి వార్త బాలీవుడ్ ని దిగ్బ్రాంతిలో ముంచి వేసింది. చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios