Asianet News TeluguAsianet News Telugu

పవన్ అడ్డమైన గడ్డి తినడు.. లగడపాటి కామెంట్స్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ప్రస్తుతం తెలుగు ప్రజల్లో ఎంతో ఉత్కంఠను కలిగిస్తోంది. నెగిటివ్ టాగ్ గట్టిగానే ఉన్నా పవన్ నడుస్తోన్న దారి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉందంటూ సీనియర్ రాజకీయ నాయకులూ అంచనా వేస్తున్నారు. 

LAGADAPATI COMMENTS ON PAWAN KALYAN
Author
Hyderabad, First Published Feb 5, 2019, 8:32 PM IST

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ప్రస్తుతం తెలుగు ప్రజల్లో ఎంతో ఉత్కంఠను కలిగిస్తోంది. నెగిటివ్ టాగ్ గట్టిగానే ఉన్నా పవన్ నడుస్తోన్న దారి అనుకూలంగా మారే అవకాశం కూడా ఉందంటూ సీనియర్ రాజకీయ నాయకులూ అంచనా వేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆంధ్రా ఆక్టోపస్ అని పిలవబడే సీనియర్ కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ పవన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పారు.

మెయిన్ గా పవన్ అడ్డమైన గడ్డి తినడు అని అడ్డమైన దారిలో డబ్బు సంపాదించకూడదనే ఒక మంచి లక్షణమున్న వ్యక్తి అని చెప్పారు. ఈ విషయం ఎవరు గమనించడం లేదని ఆయన ఎప్పుడు కూడా యాడ్స్ చేయలేదని సమాధానం ఇచ్చారు. కెరీర్ మొదట్లో ఎపుడో ఒకసారి యాడ్ చేశారని మళ్ళీ దాని తరువాత ఎలాంటి యాడ్స్ లో కనిపించలేదని సినిమా కళపై ప్రత్యేక గౌరవంతో యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించకూడదనే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ అని వివరణ ఇచ్చారు. 

ఎవరైనా సరే ఈ రోజుల్లోయాడ్స్ వస్తే చేయకుండా ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని సార్లు అలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని లగడపాటి రాజ్ గోపాల్ మాట్లాడారు. ఇక వచ్చే ఎన్నికల్లో అతను ఎంత వరకు విజయం సాదిస్తాడు అనే విషయం గురించి నేను మాట్లాడలేను కానీ పవన్ మాత్రం మంచి అభిప్రాయంతో సినిమాల్లో అంత స్టార్ డమ్ వదిలేసుకొని రాజకీయాల్లోకి రావడం ప్రశసించాల్సిన విషయమని అన్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios