Asianet News TeluguAsianet News Telugu

అటు పవన్, ఇటు రవితేజ...కుమ్ముడే...కుమ్ముడు,గ్యాప్ ఇవ్వలా

జనం ఈ వీకెండ్ ని ఎవరి సినిమాలతో సెలబ్రేట్ చేసుకున్నారు అంటే రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలతో అని చెప్పాలి. 
 

Kushi Dhamaka Shocks telugu cinema trade
Author
First Published Jan 2, 2023, 8:21 AM IST


కొత్త సంవత్సరం ప్రారంభంలో జనం తమ సెలబ్రేషన్స్ లో మునిగి ఉంటారు. సినిమాలు ఎక్కడ చూస్తారు..అందులోనూ రాబోయేది సంక్రాంతి సినిమా అని సినిమాలు రిలీజ్ చేయటానికి పెద్ద వాళ్ళు ఎవరూ ఉత్సాహం చూపించరు.దాంతో ఎలాగోలా తమ సినిమా రిలీజైతే చాలు అనుకునే వారు థియేటర్స్ లోకి దిగుతారు. వాటికి ఓపినింగ్స్ ఉండవు.కలెక్షన్స్ ఉండవు.అదే జరిగింది ఈ సారి కూడా. అయితే మరి జనం ఈ వీకెండ్ ని ఎవరి సినిమాలతో సెలబ్రేట్ చేసుకున్నారు అంటే రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలతో అని చెప్పాలి. 

రవితేజ తమ టైమ్ అయ్యిపోతుందని అనుకున్నప్పుడల్లా ఓ పెద్ద హిట్ ఇస్తున్నారు. ఆ క్రమంలో ఈ సంవత్సరం చివర్లో ధామాకా మ్యాజిక్ చేసింది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ధమాకా’ సినిమా గురించే చర్చ...రచ్చ.  ఆ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్‌కు,వస్తున్న కలెక్షన్లకు అసలు పొంతన లేదు.  ‘ధమాకా’ కలెక్షన్లు ఈ వీకెండ్ ని ఊపేసాయి. రిలీజ్  రోజును మించి ఈ వీకెండ్ లో  వసూళ్ళు రావడం.. ఆ సినిమా థియేటర్లు జనాలతో కళకళలాడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్రిస్మస్ సెలవుల్లో ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే అయింది. అలాగే న్యూ ఇయిర్ వేడుకల్లోనూ జనం ఈ సినిమాకే ప్రయారిటీ ఇచ్చారు.  ఇదిలా ఉంటే..మరో ఆశ్చర్యం టాలీవుడ్ లో జరిగింది. అదే పవన్ ఖుషీ మ్యాజిక్.
 
ఇయిర్ ఎండింగ్ రోజు  రీ రిలీజ్ జరుపుకున్న ఖుషికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. రీరిలీజ్  ట్రెండ్  వర్కవుట్ కావటం లేదు అనుకుంటున్న టైంలో ఇరవై ఏళ్ళ పాత సినిమాకు వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ సైతం షాక్ అయ్యింది. చాలా చోట్ల పెద్ద స్టార్ హీరో మూవీ రిలీజ్ రోజు ఎలా ఉంటుందో అంతకు మించిన సందడి థియేటర్ల వద్ద కనిపించింది.  వరల్డ్ వైడ్ కేవలం ఒక్క రోజుకే 3 కోట్ల 50 లక్షలకు పైగా గ్రాస్ రావడం చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోకు వచ్చే ఓపెనింగ్ అది. 
 
 కొన్ని సెంటర్ లల్లో ఈ శుక్రవారం వచ్చిన రాజయోగం, లక్కీ లక్ష్మణ్ లాంటి లేటెస్ట్ రిలీజులకు కనీస జనం లేక ఖుషి ఎక్స్ ట్రా షోలతో రీ ప్లేస్ చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  దాంతో పవన్ కళ్యాణ్, రవితేజ ఇద్దరూ ట్రెండింగ్ లో ఉన్నారు. వీళ్లిద్దరే  కొత్త సంవత్సరం ప్రారంభంలో  థియేటర్స్ కు అదిరిపోయే ఫీడింగ్ ఇచ్చారనటంలో సందేహం లేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios