ఆరో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఉత్కంఠభరిత ఎపిసోడ్‌ మధ్య కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అయ్యారు. అంతకు ముందు మోనాల్‌, కుమార్‌ సాయిని కన్‌ఫెషన్‌ రూమ్‌కి నాగార్జున రమ్మని ఇద్దరికి షాక్‌ ఇచ్చాడు. కుమార్‌ సాయి, మోనాల్‌ లను బ్యాగ్‌ సర్దుకుని కన్‌ఫెషన్‌ రూమ్‌కి రావాలని నాగ్‌ చెప్పారు. దీంతో హౌజ్‌ మొత్తం ఎమోషనల్‌ అయిపోయింది. ముఖ్యంగా అఖిల్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఆ తర్వాత మోనాల్‌ కన్నీళ్లు పెట్టుకుంది.

కన్‌ఫెషన్‌ రూమ్‌కి వెళ్లిన మోనాల్‌, కుమార్‌ సాయిలో.. కుమార్‌సాయిని ఎలిమినేట్‌ అని చెప్పేశాడు. దీంతో మోనాల్‌ ఊపిరి పీల్చుకుంది. దీంతో అఖిల్‌ కూడా రిలాక్స్ అయ్యాడు. ఇక ఎలిమినేట్‌ అయిన స్టేజ్‌పైకి వచ్చిన కుమార్‌ సాయి ఇంటిసభ్యుల రహస్యాలు బయటపెట్టాడు. కూరగాయాలతో పోల్చుతూ వారి గురించి చెప్పాలని నాగ్‌ పెట్టిన కండీషన్‌ మేరకు మొదట కరివేపాకు గురించి చెప్పాడు సాయి. 

కూరలో కరివేపాకు.. అఖిల్‌ అన్నాడు. ఆట ఆడుతున్నాడు గానీ కరెక్ట్ గా లేదని, ఇంకా దృష్టి పెట్టాలన్నారు. ఆయనకు సంబంధించిన రిజల్ట్ రాదు. టాస్క్ లు బాగా ఆడడు, ఓడిపోతుంటాడని చెప్పగా, కుమార్‌ సాయికి పెద్ద షాక్‌ ఇచ్చాడు అఖిల్‌. టాస్క్ లు గెలిచినా నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని చాలా బాధకలిగించేలా అన్నాడు. దీంతో దాన్ని లైట్‌ తీసుకున్న కుమార్‌ సాయి నాకే పంచా? అంటూ ఆగిపోయాడు. 

ఇక అవినాష్‌ కూల్‌ అని, లాస్య మొక్కజొన్నతో పోల్చి, నవ్వుతూ బతికేస్తుందని, చీరకడితే మొక్కజొన్నలా ఉంటావని అన్నాడు. నోయల్‌ నెమ్మదిగా సపోర్ట్ చేస్తుంటారని, సోహైల్‌ వేరు శేనగల వల్లే కాలక్షేపం లాంటి వాడని తెలిపాడు. ఫైనాపిల్‌ దివి అని, బయటకు కరుకుగా ఉన్నా లోపల స్వీట్‌ అని చెప్పాడు. వంకాయ తనకు నచ్చడని, హారికకి అదిసూట్‌ అవుతుందన్నారు. మెహబూబ్‌ బాయిల్డ్ ఎగ్‌ లాంటివాడని తెలిపింది. 

ఇక బిగ్‌బాంగ్‌ అమ్మా రాజశేఖర్‌పై వేశాడు. ఈ వారం మొత్తం బాత్‌రూమ్‌ క్లీన్‌ చేసేలా ఈ బిగ్‌బాంబ్‌ ఫనిష్‌మెంట్‌ ఉంటుంది. కొన్ని రోజులుగా బాత్‌ రూమ్‌ సరిగా క్లీన్‌ చేయడం లేదని, అందుకే బిగ్‌బాంబ్‌లో ఈ టాస్క్ పెట్టినట్టు నాగ్‌ చెప్పాడు. ఇప్పటికే అమ్మా రాజశేఖర్‌ నెక్ట్స్ వీక్‌ నామినేషన్‌ నుంచి సేవ్‌ అయిన విషయం తెలిసిందే.