బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ ని ప్రకటించింది బిగ్ బాస్ టీమ్. ఫైనల్ లో గీతామధురి, కౌశల్ లు ఉండగా.. కౌశల్ ని విన్నర్ గా ప్రకటించారు. కౌశల్ గెలుపు కోసం కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఆయనకి ఓట్లు వేసి గెలిపించారు. 

కౌశల్ గెలుపుపై రచయిత కోన వెంకట్ ట్వీట్ చేశారు. గతంలో ఆయన తన సినిమా ప్రమోషన్స్ లో కూడా కౌశల్ ఆర్మీ తన సినిమా చూసిన హిట్ అవుతుందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా కౌశల్ గెలవడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ''కులమతాలకు అతీతంగా ప్రజలు కౌశల్ వెంట నిలిచారు.

నిజయితీకి ప్రజలు ఇచ్చిన రియాక్షన్ ఇది. ఇంతటి సపోర్ట్ కి అతడు అర్హుడే.. సందేహం లేదు.. బిగ్ బాస్ 2 గెలుపు కౌశల్ ఆర్మీదే'' అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ చూసిన కౌశల్ ఆర్మీ ఆనందంతో కోన వెంకట్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరికొందరు కౌశల్ తో సినిమా తీయండి కోనగారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

Scroll to load tweet…