దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో చూశాం. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అల్లూరి, కొమరం భీం పాత్రల్లో అద్భుతంగా నటించారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో చూశాం. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ అల్లూరి, కొమరం భీం పాత్రల్లో అద్భుతంగా నటించారు. రాంచరణ్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ అందించగా.. ఎన్టీఆర్ ఎమోషనల్ గా కట్టి పడేశాడు. 

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నెమ్మదిగా ఒక్కో వీడియో సాంగ్ రిలీజ్ చేస్తోంది. ఇటీవలే నాటు నాటు వీడియో సాంగ్ రిలీజ్ చేయగా యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా మరో వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'కొమ్మ ఉయ్యాల' సాంగ్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. 

ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ సాంగ్ తోనే మొదలవుతుంది. బ్రిటిష్ దొరసాని చేతిపై చిన్న పాప టాటూ వేస్తూ పాడే సాంగ్ అది. ఎంతో శ్రావ్యంగా ఉండే ఆ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చిన్నారి ప్రకృతి రెడ్డి ఆ సాంగ్ ని పాడింది. సుద్దాల అశోక్ తేజ ఈ పాటకు లిరిక్స్ అందించారు. 

ఆదిలాబాద్ ఆదివాసీల జీవనాన్ని ప్రతిబింబించేలా రాజమౌళి ఈ పాటని తెరకెక్కించారు. బ్రిటిష్ చెర నుంచి కొమరం భీం ఆ పాపని విడిపించుకుని తమ గిరిజన తండాకు ఎంటర్ అయ్యే దృశ్యాలు చాలా బావుంటాయి. ఎన్టీఆర్ అసలైన కొమరం భీం గెటప్ లో అద్భుతంగా ఉన్నాడు. సాంగ్ చివర్లో ఎన్టీఆర్ అసలైన కొమరం భీమ్ గా మారి తన తండాలోకి ఎంటర్ అవుతాడు. కొమ్మఉయ్యాల సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. 

YouTube video player