విరాటపర్వం మూవీ నుండి విడుదలైన కోలు కోలు సాంగ్ ప్రోమో విశేష ఆదరణ  పొందింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ ప్రోమో రికార్డు వ్యూస్ రాబడుతుంది. నిన్న విడుదలైన కోలు కోలు సాంగ్ ప్రోమో 1మిలియన్ వ్యూస్ అందుకుంది. విడుదలైన 24గంటల లోపే ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టడం విశేషం అని చెప్పాలి. 

కోలు కోలు సాంగ్ కి స్టార్ రైటర్ చంద్ర బోస్ లిరిక్స్ అందించారు. జానపదం తీరున సాగిన కోలు కోలు సాంగ్ ఆనాటి పరిస్థితులను తలపించేలా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో సాయి పల్లవి లుక్ ఆకట్టుకుంది. ఫిబ్రవరి 25న కోలు కోలు సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో విడుదల కానుండగా, ప్రోమో విజయంతో అంచనాలు పెరిగిపోయాయి. 


దర్శకుడు వేణు ఉడుగుల పీరియాడిక్ లవ్ అండ్ రెవల్యూషనరీ డ్రామాగా విరాట పర్వం తెరకెక్కిస్తున్నారు. రానా హీరోగా నటిస్తుండగా ఆయన నక్సలైట్ పాత్ర చేస్తున్నారు. సాయి పల్లవి 90ల నాటి పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు. మరో నటి ప్రియమణి సైతం నక్సల్ గా కనిపించనుంది. విరాటపర్వం చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు. విరాట పర్వం మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.