Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ కంటెస్టెంట్లతో సంపూ ప్రోగ్రామ్!

గతేడాది ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ సీజన్ 1 ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 70 రోజుల పాటు సాగిన ఈ షో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ షోలో పాల్గొన్న హౌస్ మేట్స్ షో తరువాత కలిసి కనిపించింది లేదు. 

Kobbari Matta Song Promo Launch By Bigg Boss Telugu 1 Team
Author
Hyderabad, First Published Sep 19, 2018, 1:03 PM IST

గతేడాది ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ సీజన్ 1 ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 70 రోజుల పాటు సాగిన ఈ షో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ షోలో పాల్గొన్న హౌస్ మేట్స్ షో తరువాత కలిసి కనిపించింది లేదు.

అయితే ఇప్పుడు వీరందరినీ ఓ సినిమా కార్యక్రమం ద్వారా ఒక వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంపూర్ణేష్ బాబు దీనికి కారణమని తెలుస్తోంది. హృదయ కాలేయం సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో కొబ్బరిమట్ట అనే సినిమాలో నటించాడు.

ఈ సినిమాలో ఆయన మూడు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా సాంగ్ టీజర్ కార్యక్రమం శుక్రవారం బిగ్ బాగా కంటెస్టెంట్స్ చేతుల మీదుగా విడుదల కానుంది. షో పూర్తయి ఏడాది పూర్తవుతున్న ఈ సందర్భంలో హౌస్ మేట్స్ అందరూ ఒక వేదికపై కనిపించడానికి సిద్ధం కావడం విశేషం!

 

Follow Us:
Download App:
  • android
  • ios