థియేటర్లో `రూల్స్ రంజన్` రచ్చ ఎలా ఉందంటే?
ఈ వీకెండ్ వరకు ఈ చిత్రం థియేటర్ల వద్ద డీసెంట్ పర్‌ఫెర్మ్ చేస్తుందని తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకి స్పందన కాస్త బెటర్‌గా ఉందని అంటున్నారు.

ఈ శుక్రవారం ఆరేడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని చిన్న చిత్రాలే. ఇందులో ప్రధానంగా రెండు సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో `మ్యాడ్` పిచ్చెక్కిస్తుంది. మంచి కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మూవీ `రూల్స్ రంజన్`. కిరణ్ అబ్బవరం హీరోగా, `డీజే టిల్లు` ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించిన చిత్రమిది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాకి ప్రారంభం నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.
అయితే ఈ వీకెండ్ వరకు ఈ చిత్రం థియేటర్ల వద్ద డీసెంట్ పర్‌ఫెర్మ్ చేస్తుందని తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకి స్పందన కాస్త బెటర్‌గా ఉందని అంటున్నారు. ఆడియెన్స్ నుంచి కూడా స్పందన పాజిటివ్‌గా వినిపిస్తుంది. సినిమాలో ఫన్ బాగా వర్కౌట్ అయ్యిందని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. కొన్ని మైనస్‌లునప్పటికీ, ఫన్ దాన్ని డామినేట్ చేస్తుందని, చాలా కిరణ్ అబ్బవరం, వెన్నెల కిషోర్ సీన్లు బాగా పండాయని అవి అలరించేలా ఉన్నాయని చెబుతున్నారు.
ముంబయిలో భాష రాకపోవడంతో కిరణ్ అబ్బవరం ఇబ్బంది పడటం, అక్కడి ఎంప్లాయ్స్ ఆడుకోవడం, ఆ తర్వాత వారిని కిరణ్ కట్టడి చేయడం సీన్లతోపాటు అపార్ట్ మెంట్‌లో వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుందని టీమ్ చెబుతుంది. ఆయా సీన్లకి మంచి స్పందన లభిస్తుందట. ఇక నేహా శెట్టితో పబ్‌లో ఎంజాయ్ చేసే సీన్లు, ఆమెతో తిరిగే సీన్లు, అలాగే నైట్ బెడ్ సీన్లకి కూడా స్పందన బాగుందట. అలాగే సమ్మోహనుడా సాంగ్‌లో పీక్‌లోకి తీసుకెళ్లిందని, వినోదమే కాదు, రొమాన్స్ అదిరిపోయిందంటున్నారు. పాటలు సినిమాకి మరో హైలైట్‌గా నిలుస్తున్నాయని చెబుతున్నారు.
మరోవైపు సెకండాఫ్‌లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. తిరుపతి వెళ్లాక హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్షలు ఎంటర్ అయ్యాక కామెడీ మరింత ఊపందుకుందని, నేహా శెట్టిని వాళ్లు కూడా ఇష్టపడటం, దీంతో కిరణ్‌కి ఆ అమ్మాయి దక్కకుండా వాళ్లు ప్లాన్ చేయడం ఈ క్రమంలో వచ్చే సీన్లకి ఆడియెన్స్ థియేటర్లలో హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారని దర్శకుడు తెలిపారు. అలాగే క్లైమాక్స్ పీక్‌లో ఉందని, ఫన్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిందని, అక్కడి ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. అందులో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ ని మరింతగా సర్‌ప్రైజ్ చేస్తున్నాయని నిర్మాతలు తెలిపారు. సినిమాని ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఇంకా బాగా నచ్చుతుందని వాళ్లు వెల్లడించారు.
కిరణ్ అబ్బవరం యాక్టింగ్‌స్టయిల్, ఆయన చేసే ఫన్,అలాగే నేహా శెట్టి గ్లామర్, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సుదర్శన, హర్ష, సుబ్బరాజు, అజయ్‌ల కామెడీ, దర్శకుడు రత్నం ఎంటర్‌టైనింగ్‌గా సినిమాని డీల్ చేయడం, మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తున్నాయని నిర్మాతలు తెలిపారు. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి ఈసినిమాని నిర్మించారు.