కింగ్ నాగార్జున కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. నిన్న నాగార్జున స్వయంగా హైదరాబాద్ లోని కోవిడ్ వాక్సిన్ సెంటర్ కి వెళ్లి వాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు. నిన్న కోవిడ్ వాక్సిన్ నిన్న తీసుకున్నానని... ఎటువంటి సమస్య లేదని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ టీకా బుక్ చేసుకోవడం ఎలా అనే విషయాలకు కూడా ఆయన తన ట్వీట్ లో పొందుపరిచారు. 

కోవిడ్ టీకా కారణంగా అస్వస్థకు గురికావడంతో పాటు, కొందరు వికటించి మరణించడం జరిగింది. దీనితో చాలా మంది కోవిడ్ టీకా తీసుకోవడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున లాంటి స్టార్స్ ఈ విధంగా ప్రచారం కల్పించడం అభినందించదగ్గ విషయమే. మరోవైపు నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ విడుదలకు సిద్ధం అవుతుంది. 

వైల్డ్ డాగ్ మూవీలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషల్ ఎన్ ఐ ఏ ఏజెంట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు. ఇటీవల వైల్డ్ డాగ్ ట్రైలర్ విడుదల కాగా... మహేష్, చిరంజీవి వంటి స్టార్స్ ప్రశంసించారు. ఏప్రిల్ 2న వైల్డ్ డాగ్ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దర్శకుడు అహిషోర్ సాల్మన్ వైల్డ్ డాగ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్నారు.