Asianet News TeluguAsianet News Telugu

కోలీవుడ్ స్టార్ హీరోతో కియారా రొమాన్స్!

తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో కియారాని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం విజయ్.. అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడితో కలిసి పని చేయడానికి అంగీకరించాడు.

kiara advani to romance vijay
Author
Hyderabad, First Published Sep 2, 2019, 11:39 AM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కెరీర్ ఆరంభంలో చెప్పుకునే స్థాయిలో సినిమాలు చేయలేదు. ధోనీ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించి బాగా పాపులర్ అయింది. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా చేసి మంచి పేరు దక్కించుకుంది.

వెంటనే ఆమెకి రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో కొంత గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ 'కబీర్ సింగ్' సినిమాతో భారీ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో 'లక్ష్మీ బాంబ్' అలానే రెండు, మూడు సినిమాల్లో నటిస్తోంది.

అయితే ఇప్పుడు ఈ బ్యూటీకి మరో భారీ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో కియారాని హీరోయిన్ గా తీసుకోవాలని  భావిస్తున్నారట. ప్రస్తుతం విజయ్.. అట్లీ దర్శకత్వంలో 'బిగిల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత లోకేష్ కనగరాజ్ అనే దర్శకుడితో కలిసి పని చేయడానికి అంగీకరించాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా కియారాను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. అదే నిజమైతే.. స్టార్ హీరో విజయ్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం కియారాకి కలిసొస్తుందనే చెప్పాలి. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించనున్నారు.    

Follow Us:
Download App:
  • android
  • ios