Asianet News TeluguAsianet News Telugu

KGF డైరెక్టర్.. 150కోట్ల తెలుగు సినిమా?

KGF సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు బ్రేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కథానాయకుడు యష్ జీవితాన్నే మార్చేసిన ఆ సినిమా సక్సెస్ లో దర్శకుడి పాత్ర చాలానే ఉంది.  సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. 

KGF director telugu movie
Author
Hyderabad, First Published Jun 5, 2019, 1:55 PM IST

KGF సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డులు బ్రేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కథానాయకుడు యష్ జీవితాన్నే మార్చేసిన ఆ సినిమా సక్సెస్ లో దర్శకుడి పాత్ర చాలానే ఉంది.  సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. 

ప్రస్తుతం KGF సీక్వెల్ షూటింగ్ తో ప్రశాంత్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడికి సౌత్ లో బడా ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మెయిన్ గా టాలీవుడ్ నిర్మాణ సంస్థలు అతనిపై స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. 150కోట్ల బడ్జెట్ పెట్టడానికైనా సిద్దపడుతున్నారు. 

అందులో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉంది.  ఎలాగైనా రెండేళ్ల తరువాత ఒక స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమాను రూపొందించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. అందుకోసం ప్రశాంత్ కి 5కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. KGF 2 షూటింగ్ అయిపోగానే ఈ కాంబోపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి తెలుగులో ప్రశాంత్ ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios