KGF3 Shooting: బ్రేకింగ్ న్యూస్... ఈ ఏడాదే సెట్స్ పైకి కెజియఫ్ చాప్టర్ 3, షూటింగ్ ఎప్పుడంటే...?
కెజియఫ్ చాప్టర్ 2ప్రభంజనంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు మూవీ టీమ్. తగ్గేదే లే అంటున్నారు. ఇక్కడితో ఆగకుండా కెజియఫ్ తో మరిన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని పావులు కదుపుతున్నారు.. చాప్టర్3కి సన్నాహాలు చేస్తున్నారు.
కన్నడ యంగ్ తరంగ్ యష్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన పాన్ ఇండియా మూవీ కెజియఫ్. ఈమూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు.. వరుస రికార్డ్స్ ను బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది. ఇక సైలెంట్ గా వచ్చి కెజియఫ్ ఫస్ట్ పార్ట్ మూవీ సూపర్ సక్సెస్ సాధిస్తే.. చాప్టర్ 2 మూవీ మాత్రం .. అంతకు మించి అన్నట్టు దూసుకుపోతోంది. బాక్సాఫీస్ సంచలనంగా మారింది కెజియఫ్2
తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి ఈ సినిమా ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ఇక బాలీవుడ్ లోను ఈ సినిమా వసూళ్లు చూసి అంతా షాక్ అయ్యారు. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అటు ప్రశాంత్ నీల్ .. ఇటు యశ్ ఇద్దరూ కూడా క్లారిటీ ఇచ్చేశారు.
అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టొచ్చని అందరూ అనుకున్నారు. కాని అందరికి షాక్ ఇస్తూ.. ఈ ఏడాది నుంచే సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారు మేకర్స్. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. ఒక వైపున సలార్ సెట్స్ పైనే ఉంది. మరో వైపున ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు.
ఎన్టీఆర్ సినిమాను దసరా వరకూ పట్టాలెక్కించాలని చూస్తునట్టు ఫస్ట్ నుంచి టాక్ ఉంది. మరి ఈ మధ్యలోనే ఈ కెజియఫ్ చాప్టర్ 3 మూవీ షూటింగ్ ను ఎలా స్టార్ట్ చేస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ప్రస్తుతం కెజియఫ్ ప్రభంజనం నడుస్తూనే ఉంది. దంగల్ , బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయాలన్న ఉద్థేష్యంతో... ఈ సినిమాను సౌత్ కొరియాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.