కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’. ఈ చిత్రం ఓపెనింగ్ నుంచే బాక్సీఫీస్ వద్ద ఒక్కో రికార్డను బ్రేక్ చేస్తూ వచ్చింది. తాజాగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తొలి కన్నడ చిత్రంగా నిలిచిపోయింది.
కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీ KGF Chapter 2 బాక్స్-ఆఫీస్ కలెక్షన్ దుమ్ములేపుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ (Yash) నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు సంపాదించిన నాల్గొ భారతీయ కన్నడ చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఓపెనింగ్ నుంచే వరుస బాక్సీఫీస్ వద్ద ఒక్కో రికార్డను బ్రేక్ చేస్తూ వచ్చింది. తాజాగా రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తొలి కన్నడ చిత్రంగా నిలిచిపోయింది.
ఈ రికార్డుతో అమీర్ ఖాన్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లీగ్‌లో చేరిపోయింది కేజీఎఫ్. భారీ అంచనాలతో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అమీర్ ఖాన్ దంగల్, SS రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మరియు RRR రికార్డులను బ్రేక్ చేసేందుకు అతి చేరువలో ఉంది. ఈ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రూ. 1000 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ అందుకుతున్న ఈచిత్రం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడంతో మరో రికార్డును సొంతం చేసుకుంది. సౌత్ సినిమా తన ప్రత్యేకమైన కథాంశంతో ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రంగా కూడా KGF 2కు గుర్తింపు దక్కింది.
సౌత్ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. అతను ట్వీట్ చేస్తూ.. KGF Chapter2 ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 1,000 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిందని తెలిపారు. దంగల్ , బాహుబలి2, RRR Movie తర్వాత కేజీఎఫ్ 2 నాల్గొ చిత్రంగా స్థానం కల్పించుకుంది. మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం 15 రోజుల్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు 16వ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ ఇలా ఉంది. హిందీ బెల్ట్ - 432 కోట్లు, కర్ణాటక - 163 కోట్లు, ఏపీ/తెలంగాణ - 141 కోట్లు, తమిళనాడు - 89 కోట్లు, కేరళ - 60 కోట్లు, ఓవర్సీస్ - 177 కోట్లు రాబట్టి మొత్తంగా రూ.1, 062 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ యష్ ప్రధాన పాత్ర పోషించారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) యష్ సరసన ఆడిపాడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. హుంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. బాలీవుడ్ స్టార్ రవీనా టండన్, సంజయ్ దత్, మరియు ప్రకాష్ రాజు, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు.