పాకిస్దాన్ లో మన హిందీ సినిమాలు బాగా ఆడుతూంటాయి. తప్పించి సాధారణంగా రీజనల్ లాంగ్వేజ్ ఫిలింస్ రిలీజ్ చేయరు. చేసినా ఆడిన చరిత్ర లేదు. కానీ కన్నడ సూపర్‌స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ చిత్రానికి పాకిస్థాన్ కూడా తెగ ఆడేస్తోంది.
పాకిస్దాన్ లో మన హిందీ సినిమాలు బాగా ఆడుతూంటాయి. తప్పించి సాధారణంగా రీజనల్ లాంగ్వేజ్ ఫిలింస్ రిలీజ్ చేయరు. చేసినా ఆడిన చరిత్ర లేదు. కానీ కన్నడ సూపర్‌స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ చిత్రానికి పాకిస్థాన్ కూడా తెగ ఆడేస్తోంది. పాక్‌లో విడుదలైన తొలి కన్నడ చిత్రమిదే కావడమే కాకుండా ఇంత ఘన విజయం సాధించటమూ విశేషం.
ఇప్పటి వరకు పాక్‌లో ఏ కన్నడ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ అవకాశం ‘కేజీఎఫ్’కు దక్కింది. ‘కేజీఎఫ్ డబ్బింగ్ వెర్షన్‌ను లాహోర్, ఇస్లామాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌లలో విడుదల చేశారు. అక్కడ ఈ చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫిబ్రవరి 11న పాకిస్థాన్ దేశవ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు’ అని బెంగళూరుకు చెందిన సినీ విశ్లేషకుడు హరీశ్ మాల్యా మీడియా ద్వారా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు
ఎనభైల్లో జరిగే కధగా పీరియడ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కర్ణాటకకు చెందిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. గత ఏడాది డిసెంబర్ 21న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది.
ఈ చిత్రం 18 రోజుల్లో రూ.200 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఇప్పటివరకు ఏ చిత్రమూ ఇన్ని భాషల్లో విడుదల కాలేదు, ఇంత వసూళ్లూ రాబట్టలేదు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 14, 2019, 2:45 PM IST