యష్ కి తల్లిగా నో చెప్పా, కేజీఎఫ్ కథ కూడా నాకు నచ్చలేదు.. ఎలా ఒప్పించారంటే, నటి అర్చన కామెంట్స్
ఇండియా మొత్తం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కేజీఎఫ్ చిత్రాన్ని ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఈ చిత్రం పాన్ ఇండియా గుర్తింపు తీసుకువచ్చింది.

ఇండియా మొత్తం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కేజీఎఫ్ చిత్రాన్ని ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఈ చిత్రం పాన్ ఇండియా గుర్తింపు తీసుకువచ్చింది. ఈ చిత్రంలో రాఖీ భాయ్ గా యష్ ఎంత పవర్ ఫుల్ గా కనిపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే రాఖీ భాయ్ తల్లి పాత్రలో నటించిన అర్చన జోయిస్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరహో అనిపించింది. కన్నీళ్ళు పెట్టించేలా నటిస్తూనే ఆమె కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా చెప్పింది. తల్లి చెప్పిన మాటల వల్లే రాఖీ భాయ్ కెజిఎఫ్ సామ్రాజ్యాన్ని ఏలే స్థాయికి ఎదుగుతాడు.
నిరుపేద తల్లి పాత్రలో అర్చన నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఆమె నటనకి కూడా దేశం మొత్తం ప్రశంసలు దక్కాయి. కానీ ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు తనకి ఏమాత్రం ఆసక్తి లేదని అర్చన తాజాగా వ్యాఖ్యలు చేసింది. పైగా తల్లి పాత్రలో నటించాలని చెప్పారు. దీనితో ససేమిరా అన్నట్లు అర్చన జోయిస్ పేర్కొన్నారు.
ఎందుకంటే అప్పటికి నా వయసు 21, 22 మాత్రమే. ఈ చిత్రంలో మీరు తల్లిగా నటించాలి అని చెప్పారు. నేను వెంటనే షాక్ లో నా వయసు తెలుసా మీకు అసలు అని అడిగా.. నేను నో చెబుతున్నా వాళ్ళు వదిలిపెట్టలేదు. నన్ను అడుగుతూనే ఉన్నారు. నా స్నేహితుల ద్వారా ఒప్పించే ప్రయత్నం చేశారు. ముందు కథ విని అని నా ఫ్రెండ్స్ చెప్పారు.
సరే ఒకసారి కథ విందాం అని కూర్చున్నా.. కథ కూడా నాకు నచ్చలేదు.. అంత ఆసక్తిగా అనిపించలేదు. సినిమాకు ఓకె చెప్పాను కానీ మనస్ఫూర్తిగా నా లోపల ఒప్పుకోలేదు. కానీ సినిమా రిలీజ్ తర్వాత తానూ ఊహించని విధంగా పాపులారిటీ లభించింది అని అర్చన జోయిస్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అర్చన జోయిస్ నటించిన తాజా చిత్రం మాన్షన్ 24. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అర్చన జోయిస్ కూడా కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రం అక్టోబర్ 17న డైరెక్ట్ గా ఓటిటి హాట్ స్టార్ లో రిలీజై స్ట్రీమింగ్ అవుతోంది.