ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం 'రొమాంటిక్'. పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం 'రొమాంటిక్'. పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అనీల్ పాదూరి అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా సోమవారం నుండి గోవాలో రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టింది. ఈ సందర్భంగా సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన ఛార్మి వెల్లడించింది.

ఢిల్లీకి చెందిన కేతికా శర్మ అనే బ్యూటీ ఆకాష్ పూరితో రొమాన్స్ చేయనుంది. ఈరోజు నుండి గోవాలో జరిగే షూటింగ్ లో కేతిక కూడా పాల్గొంటుందని తెలిపారు. హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ల మనసులు దోచుకుంటున్న కేతికకి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆకాష్ పూరితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. 

Scroll to load tweet…