ఎన్టీఆర్ చుట్టూ తీరుగుతున్న కథల్లో లక్ష్మి పార్వతి వీరగ్రంధం కూడా ఒకటి. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎత్వరలోనే రిలీజ్ చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు వర్మ లక్ష్మి పార్వతిని ఎలివేట్ చేసేవిధంగా పాజిటివ్ లో తీస్తున్నారని ఆరోపణలు వస్తున్నా సంగతి తెలిసిందే. 

ఇక ఇప్పుడు కేతిరెడ్డి లక్ల్ష్మి పార్వతి బండారం ఈ సినిమాలో తెలుసుకోండని చెబుతున్నారు. అంతే కాకుండా గతంలో ఈ వెన్నుపోటుపై సినిమా చేస్తామని చెప్పినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నట్లు వివరించారు. 'ఈ సినిమాల వలన ఉపయోగం లేదు, ప్రజలకు సేవే గుర్తు ఉంటుంది. 

పైగా ఎప్పుడో జరిగిన సంఘటన. తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు కధా... మనం ఇప్పుడు సినిమా తీస్తే రాజకీయ అవసరం కోసం తీసినమని ఒక సంకేతం ప్రజల్లోకి వెళుతుంది' అని వైఎస్ చెప్పినట్లు వివరణ ఇచ్చారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన లక్ష్మి పార్వతిపై ఎవరు ఊహించని విధంగా స్పందించారు. కింద ఇచ్చిన వీడియోలో చూడవచ్చు.