వారికి సాయం చేసి.. ‘‘రియల్’’ హీరో అనిపించుకున్న విజయ్ దేవరకొండ

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 13, Aug 2018, 11:20 AM IST
Kerala floods: Vijay Devarakonda contributes to CM's flood relief fund
Highlights

తాజాగా విజయ్ దేవరకొండ ఓ పని చేసి.. తాను కేవలం రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ హీరోని అని కూడా నిరూపించుకున్నారు..

‘‘ అర్జున్ రెడ్డి’’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాధించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘ గీతా గోవిందం’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ దేవరకొండ ఓ పని చేసి.. తాను కేవలం రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ లైఫ్ హీరోని అని కూడా నిరూపించుకున్నారు..

ఇటీవల తనకు వచ్చిన మొదటి ఫిలింఫేర్‌ అవార్డును వేలం వేయగా వచ్చిన 25లక్షలను విరాళంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చి పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. విజయ్ హెల్పింగ్ నేచుర్ చూసిన అభిమానులు, తెలంగాణ ప్రజలు ఆయన్ను మెచ్చుకున్నారు.

తాజాగా.. మరోసారి విజయ్ దేవరకొండ తన మనసు చాటుకున్నాడు. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇడుక్కితో సహా పలు జిల్లాలో నీటమునిగాయి. అన్నం, నీళ్లు లేక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో విరాళులు సేకరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. 

ఈ విషయం తెలుసుకున్న విజయ్ తన వంతు సాయం చేయాలని భావించి రూ. 5లక్షలు విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. అభిమానుల్లారా మీ వంతు సాయం చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. దేవరకొండ పిలుపుమేరకు పలువురు అభిమానులు విరాళం అందించారు. డబ్బులు ఫలానా అకౌంట్‌కు తాము ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ట్విట్టర్‌లో తమ అభిమాన హీరో విజయ్‌ దేవరకొండకు ట్యాగ్ చేసి.. కామెంట్స్‌ రూపంలో తెలియజేశారు.

loader