'ఆర్‌ ఎక్స్ 100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి 'గుణ 369' అనే పేరును ఖ‌రారు చేశారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ సందర్భంగా.. ''ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశామని.. మ‌ళ్లీ ఈ నెల 29 నుంచి మే 15 వ‌ర‌కు మ‌రో భారీ షెడ్యూల్ చేయ‌బోతున్నట్లు.. దాంతో ఒక సాంగ్ మిన‌హా సినిమా మొత్తం పూర్త‌వుతుందని'' దర్శకుడు చెప్పారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ''కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్ప‌టిదాకా తీసిన‌ ర‌షెస్ చూసుకున్నాం. ప్ర‌తి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది. రియ‌లిస్టిక్ చిత్ర‌మిది'' అని అన్నారు.