Asianet News TeluguAsianet News Telugu

'RX 100' హీరో కొత్త టైటిల్ ఇదే..!

'RX 100' చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయకి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడు ఓ బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

karthikeya next movie titled as hippi
Author
Hyderabad, First Published Sep 20, 2018, 3:28 PM IST

'RX 100' చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయకి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతడు ఓ బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గతంలో భారీ చిత్రాలను తెరకెక్కించిన థాను.. తుపాకీ, కబాలి, విఐపి2 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ప్రస్తుతం ఆయన కార్తికేయ హీరోగా సినిమా చేస్తున్నారు. టిఎన్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రేపు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం సినిమా టైటిల్ ని విడుదల చేసింది.

'హిప్పీ' అనే టైటిల్ ని రివీల్ చేస్తూ కార్తికేయ స్టిల్ ని వదిలింది. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో కార్తికేయ సరికొత్తగా కనిపించబోతున్నారని దర్శకుడు వెల్లడించారు. హీరో కార్తికేయ ఈ సినిమాతో తన సక్సెస్ ను కంటిన్యూ చేస్తానని చాలా నమ్మకంతో అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios