కెమెరామెన్‌ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్‌ ఘట్టమనేని ఇప్పుడు `మిరాయ్‌` సినిమాతో వస్తున్నారు. ఈ మూవీ కథేంటో ఆయన లీక్‌ చేశారు. వామ్మో కథ వేరే లెవల్‌. 

సెప్టెంబర్‌ 12న రాబోతున్న `మిరాయ్‌`

`హనుమాన్‌`తో సంచలనం సృష్టించిన హీరో తేజ సజ్జా ఇప్పుడు `మిరాయ్‌` చిత్రంతో రాబోతున్నారు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటించడం విశేషం. హీరోయిన్‌ శ్రియా శరన్‌, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలు పోషించారు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. ముఖ్యంగా `మిరాయ్‌` కథేంటో తెలిపారు.

`మిరాయ్‌` కథ ఇదే

ఈ సినిమా కథ గురించి దర్శకుడు చెబుతూ, `మిరాయ్‌` కథ ఏడేళ్ల క్రితమే పుట్టిందట. దాన్ని ఇతిహాసాలకు జోడించడానికి ఇంత టైమ్‌ పట్టిందన్నారు. `చిన్నప్పటి నుంచి పురాణ ఇతిహాసాలను గురించి విన్న కథలు, పాషనేటింగ్ ఎలిమెంట్స్ తో `మిరాయ్` కథని డెవలప్‌ చేశాను. ఇది మన రూటేడ్ కథలా ఉంటుంది. అశోకుని వద్ద తొమ్మిది గ్రంధాలు ఉన్నాయనే ఒక మిత్ ఉంది. ఆ తొమ్మిది పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాలు ఆధారంగా ఎలా కాపాడవచ్చనేది `మిరాయ్` ఐడియా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఇతిహాసాల్లో, పురాణాల్లో ఉందనే నమ్మకంతో చేసిన కథ. ఈ కథని యాక్షన్ అడ్వెంచరస్‌గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్. ఈ కథ దాదాపు ప్రజెంట్ లోనే జరుగుతుంది. ఈ మూవీకి ఆడియన్స్ అందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు. మంచి ఎక్స్ పీరియెన్స్ పొందుతారు` అని తెలిపారు కార్తీక్‌ ఘట్టమనేని.

`మిరాయ్‌`లో సర్‌ప్రైజ్‌లు

ఆయన ఇంకా మాట్లాడుతూ, `ఇందులో జటాయువు బ్రదర్ సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. అది చాలా సర్ ప్రైజ్ గా ఉంటుంది. దీనికోసం యానిమేట్రానిక్ టెక్నాలజీ ఉపయోగించాం. సినిమా అవుట్ ఫుట్ చూసుకున్నాక మేము అనుకున్న దానికంటే బెటర్ గా వచ్చిందనే ఫీలింగ్ కలిగింది. ఇందులో ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది. దాన్ని శ్రీలంకలో షూట్ చేసాము. అది పేపర్ మీద చూసుకున్నప్పుడు నిజంగా ఎలా వస్తుందా అనిపించింది. కానీ ఔట్‌పుట్‌ చూసుకున్నాక చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ అందరూ సర్ప్రైజ్ అవుతారు. ప్రతి సీక్వెన్స్ కూడా మేము అనుకున్న దాని కంటే చాలా బెటర్ గా వచ్చింది. ఈ సినిమాని యూనివర్స్ ముందుకు తీసుకెళ్ళింది. అందుకే ట్రైలర్లో 'ది పవర్ ఆఫ్ బ్రహ్మాండ' అని పెట్టాం. ఈ సినిమాలో చాలెజింగ్ పార్ట్ డ్రామా, ట్రీట్మెంట్ ని క్రాక్ చేయడం. దీనికి చాలా సమయం పట్టింది` అని అన్నారు కార్తీక్‌.

`మిరాయ్‌`లో యాక్షన్‌, ఆర్టిస్టుల గురించి

సినిమాలోని యాక్షన్‌, మెయిన్‌ క్యారెక్టర్స్ గురించి చెబుతూ, `ఇందులో ఆరేడు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. అందులో ఒక ఫాస్ట్ యాక్షన్ ని ట్రై చేశాం. హీరో తేజ ఈ సినిమా కోసం థాయిలాండ్ లో ప్రత్యేకం శిక్షణ తీసుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమాకి పాజిటివ్ సైడ్ ఉంటూ నేచురల్ అగ్రేషన్ ఉన్న ఒక యాక్టర్ కావాలి. మంచు మనోజ్ కరెక్ట్ గా ఈ క్యారెక్టర్ కి ఫిట్ అవుతారు. మనోజ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా అనుభవం ఉంది. అది మాకు హెల్ప్ అయ్యింది. ఆయన చాలా బాగా చేశారు. వనరబుల్ గా ఉంటూ అదే సమయంలో స్ట్రెంత్ గా కూడా కనిపించే ఒక పాత్ర కావాలి. అలాంటి పాత్రకి శ్రీయా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతారనిపించి చేశాం. తల్లి కొడుకుల ఎమోషన్ ఈ సినిమాకి చాలా కీలకం. శ్రియా అద్భుతంగా చేశారు. వీరితోపాటు జయరాం అగస్త్య ముని పాత్రలో కనిపిస్తారు. జగపతి బాబు తాంత్రిక గురువు పాత్రలో కనిపిస్తారు. ఈ రెండు పాత్రలు కీలకంగా ఉంటాయి. వాళ్లు కూడా అంతే బాగా నటించారు` అని తెలిపారు. శనివారం మీడియాతో ముచ్చటిస్తూ ఈ విషయాలను పంచుకున్నాడు దర్శకుడు.

YouTube video player