`మహాభారతం చదివావా.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలిచ్చాన కౌరవులు మారలేదు. నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కాదా ఇస్తా` అని విలన్లు అంటే `మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే..అదే మహాభారతాన్ని ఒక్కసారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సర్` అని హీరో కార్తీ అంటున్నాడు. ఇది ఆయన నటిస్తున్న `సుల్తాన్‌` చిత్ర టీజర్‌లోని డైలాగులు. 

బక్కియ రాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సుల్తాన్‌`. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ గరుడ పాత్ర ధారి కూడా నటిస్తుండటం వివేషం. తాజాగా విడుదలైన టీజర్‌ బాగా ఆకట్టుకోవడంతోపాటు అంచనాలను పెంచుతుంది. `మహాభారతం` రివర్స్ లో ఈ సినిమా కథ సాగుతుందని తాజాగా టీజర్‌లోని డైలాగులను వింటే అర్థమవుతుంది. చాలా ఆసక్తికరంగా సాగిందీ టీజర్‌. భయంకరమైన విలన్లు, స్టయిలీష్‌గా కార్తీ ఎంట్రీ హైలైట్‌గా నిలిచాయి. రష్మిక మందన్నా కూడా ఆకట్టుకునేలా ఉంది.

ఇక డ్రీమ్స్ వాయిర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ ఆర్‌ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో విడుదల కానున్నట్టు తెలుస్తుంది.